West Indies all out for 311 against India రెండో రోజున చాపచుట్టేసిన విండీస్..

West indies all out for 311 chase shines with century

Team India, india vs west indies 2nd test, ind vs wi 2nd test, Umesh Yadav, Ashwin, virat kohli, Shardul Thakur, Roston Chase, Kuldeep Yadav, hyderabad test, sports news, sports, latest sports news, cricket news, cricket

West Indies were all out for 311 in their first innings on day two of the second and final test against India. Overnight batsman Roston Chase completed his fourth test century, topscoring for his side with 106.

రెండో రోజున చాపచుట్టేసిన విండీస్..

Posted: 10/13/2018 04:01 PM IST
West indies all out for 311 chase shines with century

హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి తొలి ఇన్నింగ్స్ ను ముగించేసింది. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజున టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించిన విండీస్ బ్యాట్స్ మెన్లు రెండో రోజు మాత్రం ఎదుర్కోనలేకపోయారు. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్ ను 311 పరుగల వద్ద ముగించేసింది.

295/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు తో శనివారం రెండో రోజున తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (106: 189 బంతుల్లో 8x4, 1x6) శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బంతితో చెలరేగిన ఉమేశ్ యాదవ్ (6/88) వరుసగా బిషూ (2), రోస్టన్ చేజ్, గాబ్రిల్ (0) పెవిలియన్ బాట పట్టించడంతో.. తొలి సెషన్ ఆరంభంలోనే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నిన్న కుల్దీప్ యాదవ్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసిన విషయం తెలిసిందే.

ఆటలో తొలిరోజైన ఒకానొక దశలో 113/5తో నిలిచిన వెస్టిండీస్ జట్టుని అసాధారణ ఆటతో మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చిన రోస్టన్ చేజ్ ఎట్టకేలకి ఈరోజు శతకం మార్క్‌ని అందుకున్నాడు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత బ్యాట్స్‌మెన్స్ ముగ్గురు (పృథ్వీ షా, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా) శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌ తరఫున తాజాగా చేజ్‌ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. రెండేళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 24 టెస్టులాడిన రోస్టన్ చేజ్‌కి ఇది నాలుగో శతకం కాగా.. అతని ఖాతాలో 6 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles