Shiv Thakor guilty of exposure ఆ క్రికెటర్ ను దోషిగా తేల్చేశారు..

Shiv thakor guilty of exposure

England, Shiv Thakor, former captain, England cricketer,objectionable behaviour, crime, sports news,sports, latest sports news, cricket news, cricket

Former England Under-19 cricket captain Shiv Thakor was found guilty by a UK court of exposing himself to two women on a housing estate,

ఆ క్రికెటర్ ను దోషిగా తేల్చేశారు..

Posted: 11/16/2017 09:06 PM IST
Shiv thakor guilty of exposure

మహిళలతో మర్యాదగా నడుచుకోవాలని, గౌరవంగా వ్యవహరించాలన్న విషయాన్ని మర్చిపోయి బహిరంగ ప్రదేశాల్లో వారి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఇంగ్లాండ్ అండర్ -19 మాజీ కెప్టెన్‌ శివ్ థాకూర్ ను కోర్టు అపరాధిగా తేల్చింది. కేసు విచారించిన డెర్బీ క్రౌన్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. నవంబర్ 24న అతడికి శిక్ష ఖరారు చేయనుంది.

న్యాయస్థానం అతడికి షరతుల్లేని బెయిల్ మంజూరు చేసింది. కౌంటీ క్రికెట్ లో డెర్బీషైర్ తరపున ఆడిన నిందితుడు రెండు సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించినట్టు  ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది జూన్ 12, 19 తేదీల్లో ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ముందు అభ్యంతకరంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులు రావడంతో జులైలో శివ్ థాకూర్ ను అరెస్ట్‌ చేశారు.

విచారణలో భాగంగా బాధితులు ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు విశ్వసించింది. శివ్‌ నేరానికి పాల్పడినట్టు న్యాయస్థానం ధ్రువీకరించింది. కాగా, శివ్‌ థాకూర్‌ అరెస్టైన వెంటనే అతడితో డెర్బీషైర్ టీమ్‌ తెగతెంపులు చేసుకుంది. 2014 -16 మధ్య కాలంలో ఈ యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England  Shiv Thakor  former captain  England cricketer  objectionable behaviour  crime  cricket  

Other Articles