Bhuvneshwar Kumar set to tie the knot పెళ్లిపీటలెక్కనున్న ఇండియన్ పేసర్

Bhuvneshwar kumar could get married to nupur nagar in late november

bhuvneshwar kumar, bhuvneshwar kumar wedding, bhuvneshwar marriage, bhuvneshwar kumar wife, bhuvneshwar kumar fiance, cricket news, sports news, Team India, cricket

Pacer Bhuvneshwar Kumar is reportedly set to tie the knot with his fiancee Nupur Nagar on November 23. It will be followed by two reception dinners on the November 26 and 30 in Bulandshahr and Delhi respectively.

పెళ్లిపీటలెక్కనున్న ఇండియన్ పేసర్

Posted: 11/11/2017 05:59 PM IST
Bhuvneshwar kumar could get married to nupur nagar in late november

టీమిండియాలో యువ క్రికెటర్లు గత రెండేళ్ల నుంచి ఒక్కోక్కరుగా ఇంటివారు అవుతున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో పెళ్లి బాటలో పయనిస్తున్నాడు మరో క్రికెటర్. ఎవరా అటగాడని అంటారా..? పేసర్ భువనేశ్వర్. ఈయన కూడా తన ప్రియురాలితో కలసి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ నెల 23న గ్రేటర్ నొయిడాకు చెందిన ఆయన తన ప్రియురాలు నుపూర్ నగర్ తో భువీ వివాహం జరుగనుంది. ఈ మేరకు భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ మీడియాకు తెలిపారు.

ఈ నెల 23న వివాహం, 26, 30 తేదీల్లో రిసెప్షన్ జరుగుతుందని కిరణ్ పాల్ సింగ్ తెలిపారు. వివాహం ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్లో జరుగుతుందని, బులందషార్ లో రిసెప్షన్ జరుగుతందని తెలిపారు. అయితే బీసీసీఐ యాజమాన్య సభ్యులు, టీమిండియా ఆటగాళ్ల కోసం ఈ నెల 30న ఢిల్లీలో మరోసారి రిసెస్పషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శ్రీలంకతో జరుగనున్న రెండో టెస్ట్ కోసం భారత జట్టు ఆ సమయానికి ఢిల్లీకి చేరుకోనుంది.

ఇదే సమయంలో జట్టు యాజమాన్యంతో పాటు టీమిండియా సహచర క్రికెటర్లందరికీ రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు కిరణ్ పాల్ సింగ్ అన్నారు. ఈ వేడుకకి భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా హాజరవుతారని, వీరితో పాటు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కూడా వస్తారని ఆయన అన్నారు. వివాహం కారణంగా భువీ రెండు టెస్ట్‌ ఆడటం లేదు. ఈ వేడక అనంతరం మూడో టెస్ట్‌లో భువీ ఆడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhuvneshwar kumar  wedding  nupur nagar  bulendershar  virat kohli  indian cricket team  bcci  cricket  

Other Articles