Hyderabadi named USA cricket skipper యుఎస్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా హైదరాబాదీ..

Former hyderabad cricketer khaleel named usa skipper

ibrahim khaleel, ibrahim khaleel usa, usa ibrahim khaleel, ibrahim khaleel wicket-keeper, ibrahim khaleel hyderabad, ibrahim khaleel batting, usa, cricket team, wicket-keeper, captain, hyderabad, sports news, sports, cricket news, cricket

From being a stumper-batsman, and ranji, duleep trophy player the 34-year-old has now been given the responsibility of leading USA cricket team.

యుఎస్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా హైదరాబాదీ..

Posted: 09/19/2017 04:19 PM IST
Former hyderabad cricketer khaleel named usa skipper

అన్నింటా ముందుండే అగ్రరాజ్యం క్రికెట్ లో మాత్రం కాసింత వెనుకబడింది. దీంతో తాజాగా క్రికెట్ క్రీడపై దృష్టి సారించిన అమెరికా.. కొత్తగా జట్టును కూడా ఎంపిక చేసింది. అయితే ఆ జట్టుకు మనవాడే పెద్దదిక్కు అయ్యాడు. యూఎస్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ కు చెందిన ఇబ్రహీం ఖలీల్‌ అమెరికా క్రికెట్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు. దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీల్లో మొత్తం 57 ఫస్ట్ క్లాస్‌ మ్యాచులు ఆడిన ఖలీల్…. 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సహా 2,158 పరుగులు చేశాడు.  

2011లో గౌహతిలో అస్సాంతో జరిగిన రంజీ మ్యాచులో 14 మందిని (11 క్యాచులు, 3 స్టంపింగులు) అవుట్‌ చేయడంలో భాగమై ఈ ఘనతను సాధించిన వికెట్ కీపర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసీఎల్‌)లో కూడా సత్తా చాటాడు. దాదాపు 12 ఏళ్ల పాటు రంజీ ట్రోఫీ ఆడాడు ఖలీల్‌. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు. తన కుటుంబ స్నేహితురాలు, అమెరికా పౌరసత్వం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

2015 జనవరిలో తన ఆఖరి మ్యాచు ఆడి.. మొత్తానికే గుడ్ బై చెప్పేశాడు. అలా అమెరికాలో స్థిరపడదామనుకున్న ఖలీల్ కు షికాగోలో జరిగే లీగ్‌ మ్యాచులలో ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడదే ఆయన్ను యూఎస్ టీమ్ కు కెప్టెన్ ను చేసింది. తన భార్య కారణంగా అప్పటికే గ్రీన్‌కార్డ్‌ కలిగి ఉన్న ఖలీల్‌ 2016లో జరిగిన సెలక్షన్స్ లో పాల్గొన్నాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహించేందుకు కావాల్సిన అర్హతలు పూర్తి చేసేందుకు క్రికెట్‌ అసోసియేషన్‌ సహకరించింది. ఫాస్ట్ ట్రాక్ లో అతని పౌరసత్వ దరఖాస్తును ముందుకు జరిపి చివరకు జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ibrahim khaleel  usa  cricket team  wicket-keeper  captain  hyderabad  cricket  

Other Articles