I don’t watch Sri Lanka: Arjuna Ranatunga శ్రీలంక క్రికెట్ పై అర్జున రణతుంగా ఘాటు వ్యాఖ్యలు

I don t watch sri lanka national team anymore arjuna ranatunga

Arjuna Ranatunga, sri lanka, sri lankan cricket team, cricket sri lanka, cricketravi shastri, rahul dravid, sourav ganguly, sachin tendulkar, vvs laxman, bharat arun, india cricket team, sl vs ind, ravi shastri, rahul dravid, sachin tendulkar, sourav ganguly, vvs laxman, bharat arun, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

Arjuna Ranatunga said he preferred watching the recent England-South Africa Test series than the ongoing home series between Sri Lanka and India.

శ్రీలంక క్రికెట్ పై అర్జున రణతుంగా ఘాటు వ్యాఖ్యలు

Posted: 08/02/2017 08:59 PM IST
I don t watch sri lanka national team anymore arjuna ranatunga

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011వ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ.. తాజాగా మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఆడే మ్యాచ్ లను చూడనంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పరిపాలనలో ఉన్న అసహ్యకర వాతావరణమే తనను తమ మ్యాచ్ లు చూడకుండా చేయడానికి ప్రధాన కారణమని రణతుంగ పేర్కొన్నాడు.

'శ్రీలంక క్రికెట్ లో చీదరించుకునే వాతావరణం నెలకొని ఉంది. దాంతో మా జాతీయ జట్టు ఆడే మ్యాచ్ లను చూడాలని అనుకోవడం లేదు. మా జట్టు ఏ సిరీస్ ఆడుతున్నా చూసే ఆసక్తిమాత్రం నాకు లేదు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగున్న టెస్టు సిరీస్ ను చూడాలని నిర్ణయించుకున్నా. ఆయా జట్ల మధ్య జరిగే సిరీస్ ను చూస్తున్నా'అని రణతుంగా పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్ లో ప్రక్షాళన కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు రణతుంగా లేఖ రాస్తానని రణతుంగా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjuna Ranatunga  sri lanka  sri lankan cricket team  cricket sri lanka  cricket  

Other Articles