India- Sri Lanka bilateral series dates announced విరాట్ సేన శ్రీలంక పర్యటన ఖరారు.. ఇదిగో షెడ్యూలు..

India s tour of sri lanka full match schedule date time venue

India vs Sri Lanka, Indias tour of Sri Lanka, India vs Sri Lanka schedule, Ind Vs SL, virat kohli, rohit sharma, jasprit bumrah, cricket news, cricket, sports news, latest news

After the West Indies tour, India is scheduled to visit Sri Lanka for a bilateral series for which Board of Cricket Control of India announced the match schedules.

విరాట్ సేన శ్రీలంక పర్యటన ఖరారు.. ఇదిగో షెడ్యూలు..

Posted: 06/20/2017 03:57 PM IST
India s tour of sri lanka full match schedule date time venue

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాంపియన్స్‌ ట్రోఫీ లో ఢిపెండింగ్ ఛాంపియన్స్ టీమిండియా దాయాధి పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో.. ఇటు దేశవ్యాప్తంగా అభిమానుల నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. వారు అటు నుంచి అటే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నారు. విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విరాట్ కోహ్లీ ఈ ట్రోఫీలో పరాజయాన్ని తొలిసారి తన పారధ్యంలో పరభవాన్ని చవిచూశారు.

అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగానే నిర్ణయమైన షెడ్యూల్ మేరకు విరాట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. జూన్‌ 23నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటన జులై 9తో ముగియనుంది. కాగా అభిమానులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. దాయాధితో పరాజయంతో దేశానికి తిరిగి రావడానికి ముఖం చెల్లక విరాట్ సేన అటునుంచి అటే విండీస్ పర్యటనకు వెళ్లిందన్న విమర్శలు వినబడుతున్నాయి.

వెస్టిండీస్‌ పర్యటన అనంతరం 10 రోజుల విరామం తర్వాత భారత్‌... శ్రీలంకలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో భారత్‌ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. జులై 26 నుంచి సెప్టెంబరు 6 మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకుముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. 2015లో భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. కాగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా లీగ్‌ దశలో భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

షెడ్యూల్‌ వివరాలు
వార్మప్‌ మ్యాచ్‌లు: జులై 21, 22

టెస్టులు
మొదటి టెస్టు: జులై 26-30(క్యాండీ)
రెండో టెస్టు: ఆగస్టు 4-8(గాలే)
మూడో టెస్టు: ఆగస్టు 12-16(కొలంబో)

వన్డేలు
తొలి వన్డే: ఆగస్టు 20
రెండో వన్డే: ఆగస్టు 24
మూడో వన్డే: ఆగస్టు 27
నాలుగో వన్డే: ఆగస్టు 30
ఐదో వన్డే: సెప్టెంబరు 3

టీ20: ఒక్క మ్యాచ్
సెప్టెంబరు 6

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri lanka Cricket Board  srilanka  team india  bcci  shedule  virat kholi  cricket  

Other Articles