Virat Kohli reclaims World No.1 ODI ranking మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న విరాటుడు..

Kohli regains top spot in icc odi rankings for batsmen

Bhuvaneshwar Kumar, champions trophy 2017, icc champions trophy, ICC ODI rankings, india vs bangladesh, Kohli, shikhar dhawan, virat kohli, cricket news, sports news, Team India, cricket

Virat Kohli has reclaimed the top batting spot, while Australia’s pace ace Josh Hazlewood has achieved the number-one position in the bowling.

మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న విరాటుడు..

Posted: 06/13/2017 09:40 PM IST
Kohli regains top spot in icc odi rankings for batsmen

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు తన సత్తా చాటాడు. తన దూకుడు స్వభావాన్ని అటలో కూడా కనబర్చి.. చెలరేగిపోతున్న విరాటుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరోమారు తనకు కొంతకాలం దూరమైన ర్యాంకు తిరిగి అదిమిపట్టుకున్నాడు. ప్రస్తుతం జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో రెండో మ్యాచులో మిన‌హా కోహ్లీ మిగ‌తా రెండు మ్యాచుల్లో కోహ్లీ రాణించడంతో అతని ర్యాంకు కూడా మెరుగుపడింది. దీంతో వ‌న్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో త‌న ర్యాంకును మెరుగు ప‌రుచుకుని మ‌రోసారి అగ్రస్థానానికి ఎగ‌బాకాడు.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన వన్డే ( 50 ఓవర్ల పరిమితి మ్యాచ్)లలో కోహ్లీ మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ర్యాకింగ్స్ లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఏబీ డీ విల్లియ‌ర్స్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ల‌ను వెన‌క్కునెట్టేశాడు. ప్రస్తుతం కోహ్లీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో 861 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండ‌గా, డేవిడ్ వార్నర్. కోహ్లీ కంటే ఒకే ఒక్క పాయింట్ వెన‌క‌బ‌డి 861 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక  ఏబీ డీ విల్లియ‌ర్స్ 847 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా జో రూట్‌, కానె విలియ‌మ్సన్ ఉన్నారు.  కాగా టీమిండియాకు చెందిన ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఈ రాక్సింగ్స్ లో పదో స్థానాన్ని అక్రమించుకున్నాడు. ఇదిలావుండగా, రోహిత్ శర్మ 13వ స్థానంలో, మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని 14వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అస్ట్రేలియాకు చెందిన హాజిల్ వుడ్ నెంబర్ వన్ స్తానంలో కొనసాగుతుండగా, టీమిండియాకు చెందిన ఏ బౌలర్ కు టాప్ టెన్ లో ప్రాతినిథ్యం లభించలేదు. కాగా అల్ రౌండర్ జాబితాలో మాత్రం రవీంద్ర జెడేజా 8వ స్థానంలో కొనసాగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles