Sana ganguly wins hearts on social media నెట్టింట్లో మాజీ కెప్టెన్ కూతరి ఫోటోలు వైరల్

Sourav ganguly s first photo shoot with daughter sana wins hearts on social media

sourav ganguly, sourav gangulys daughter, photographs of sana ganguly, photoshoot of sourav ganguly and his daughter, daughter, sana ganguly, debut photoshoot, jewellery brand, social media, viral, cricket

Sana Ganguly, 16-year-old daughter of former Indian captain, Sourav Ganguly was shooting for a premium jewellery brand and she looked absolutely gorgeous.

నెట్టింట్లో మాజీ కెప్టెన్ కూతరి ఫోటోలు వైరల్

Posted: 05/25/2017 03:57 PM IST
Sourav ganguly s first photo shoot with daughter sana wins hearts on social media

టీమిండియా మాజీ కెప్టెన్ కూతురి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. పదహారాణాల పడుచుపిల్ల.. భారత సంప్రదాయమైన గులాబీ వర్ణం చీరలో అలా ఫోటోషూట్ లోకి వచ్చి ఫోటోలకు ఫోజులిస్తుంటే.. అవి కాస్తా సోషల్ మీడియాలోకి వచ్చి రాగానే వైరల్ అయ్యాయి. గతంలో చాలా మంది సెలబ్రిటీ కిడ్స్‌ సోషల్‌ మీడియాలో దుమారం రేపడం ఒక ఎత్తు.. గంగూలీ కూతురు ఒక ఎత్తు.. సనా అమ్మా.. సనా ఇక్కడ అన్నట్లుగా వారికి పూర్తి భిన్నంగా ఫోటలు వుండటం గమనార్హం. ఇంతకీ ఈ సనా ఎవరి కూతురో తెలుసుకదూ..!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారాల పట్టీ. చిన్నారిగా అప్పుడప్పుడు తండ్రి గంగూలీతో కలిసి ఫొటోలలో కనిపించిన సనా ఇప్పుడు ఏకంగా తండ్రితో కలసి ఓ జువెలరీ బ్రాండ్ వాణిజ్య ప్రకటనలో నటిస్తుంది. అందుకోసం జరిగిన ఫోటో షూట్ లో తండ్రి కన్నా కూతరే అందరినీ అకర్షిస్తుంది. బంగారు అంచు కలిగిన గులాబీవర్ణం చీరను కట్టుకొని ఈ ఫొటోలలో ముగ్ధమోహనంగా సనా దర్శనమిచ్చింది. తండ్రి గంగూలీ, తల్లి డొనా ఈ ఫొటోలను తమ ఫేస్‌బుక్‌ పేజీలలో షేర్‌ చేసుకున్నారు. కెమెరా ముందు ఏ మాత్రం బెరుకులేకుండా కనిపించిన సనా ఈ ఫొటోలలో అద్భుతంగా ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  daughter  sana ganguly  debut photoshoot  jewellery brand  social media  viral  cricket  

Other Articles