విరాట్ కోహ్లితో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి విభేదాలు లేవని సీనియర్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మైదానంలో తామిద్దరి భావోద్దేగాలు ఒకరకంగా ఉంటాయని చెప్పాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వ్యూలో కోహ్లిపై తన అభిప్రాయాలను గంభీర్ వెల్లడించాడు. కోహ్లి నాయకత్వ పటిమను ప్రశంసించాడు. 'ఐపీఎల్ మ్యాచ్ లో కావాలనే కోహ్లితో గొడవ పడలేదు. ఇందులో వ్యక్తిగత విభేదాలు లేవు. విరాట్ కు వ్యతిరేకంగా ఆడాల్సి వస్తే దూకుడుగా ఉండక తప్పద'ని అన్నాడు. 2013 ఐపీఎల్ లో కోహ్లి, గంభీర్ మైదానంలో తిట్టుకున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ అనేది సీరియస్ క్రీడ అని, మైదానంలో దూకుడుగా ఉండడం తప్పు కాదని గంభీర్ అన్నాడు. 'విరాట్, నేను మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తుంటాం. ఆట పట్ల మాకు ఎంతో ప్రేమ ఉంది.మేమిద్దరం ఒక జట్టులో ఉంటే ఒకే లక్ష్యం కోసం ఆడతామ'ని గంభీర్ చెప్పాడు. మార్గదర్శిలా కోహ్లి కెప్టెన్సీ ఉందని కితాబిచ్చాడు. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన గంభీర్ తొలిసారి కోహ్లి నాయకత్వంలో టెస్టు మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు రాణించి తన సత్తా తగ్గలేదని చాటాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more