మాస్టర్ బ్లాస్టర్ రికార్డుకు చేరువలో ధోని.! MS Dhoni set to break Tendulkar's ODI record

Ms dhoni set to break sachin tendulkar s odi record

MS Dhoni, Sachin Tendulkar, ODI, New Zealand, sixer records, team india, ndia virat kohli, gautam gambhir, Gautam Gambhir on Virat Kohli, India, India vs New Zealand 2016, news, google news, sports news, sports, cricket

skipper Mahendra Singh Dhoni will eye another big win when favourites India take on New Zealand in the second match of the five-match rubber at the Ferozeshah Kotla Stadium

మాస్టర్ బ్లాస్టర్ రికార్డుకు చేరువలో ధోని.!

Posted: 10/20/2016 04:37 PM IST
Ms dhoni set to break sachin tendulkar s odi record

టీమిండియా లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముందు మూడు రికార్డులు ఊగిసలాడుతున్నాయి. తమను బద్దల కోట్టగలడా అని వేచిచూస్తున్నాయి. ధోనీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదైతే ఆ రికార్డులు సులువగా సాధిస్తాడు. తనకు చేరువలో వున్న రికార్డులను తిరగరాసేస్తాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దాంతో పాటు మరిన్ని రికార్డులు ధోనీని ఊరిస్తున్నాయి.  ఆ రికార్డులు ఏంటంటే.. వన్డేల్లో ధోనీ మరో మూడు సిక్స్ లు కొడితే సచిన్(195 సిక్సర్లు) రికార్డును అధిగమిస్తాడు. అదే విధంగా 7 సిక్స్ లు కొడితే వన్డేలలో 200 సిక్సర్ల రికార్డును నమోదు చేసిన భారత తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు.

ఎంఎస్ ధోనీ మరో 61 పరుగులు సాధిస్తే వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. కెరీర్ లో 279 వన్డేలు ఆడిన ధోనీ 8,939 పరుగులు చేశాడు. మరికొంత కాలం వన్డేల్లో కొనసాగే అవకాశం ఉన్నందున పదివేల క్లబ్ లో చేరే అవకాశం ధోనీకి ఉంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత సారథి ధోనీ రికార్డులపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Sachin Tendulkar  sixer records  team india  cricket  

Other Articles