Sourav Ganguly raises questions on Dhoni's future as India captain

Sourav ganguly questions dhoni s future as india captain

Cricket News, Sourav Ganguly, MS Dhoni, Team India Captain, Virat Kohli, Cricket India, 2019 World Cup, ms dhoni india captain,ganguly praises dhoni

Sourav Ganguly is not sure if MS Dhoni will be captaining India three-four years down the line. He is backing Test captain Virat Kohli for the same.

ధోని కెప్టెన్సీపై సౌరవ్ గంగూలీ అసక్తికర వ్యాఖ్యలు..

Posted: 05/10/2016 06:10 PM IST
Sourav ganguly questions dhoni s future as india captain

టీమిండియా అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.2019లో ఇంగ్లండ్లో జరిగే వన్డే ప్రపంచ కప్ నాటికి ధోనీ కెప్టెన్గా ఉండకపోవచ్చని ఆయన అన్నాడు. అప్పటివరకు సెలెక్టర్లు అతడినే కెప్టెన్గా కొనసాగిస్తే ఆశ్చర్యమేనని చెప్పాడు. వచ్చే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని భారత సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంపై సముచిత నిర్ణయం తీసుకోవాలని దాదా కోరాడు. వన్డే జట్టు కెప్టెన్ పదవికి కోహ్లీ పేరును సూచించాడు.

'ధోనీ 9 ఏళ్లుగా టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అతను అద్భుతమైన కెప్టెన్. అయితే మరో నాలుగేళ్ల వరకు జట్టుకు కెప్టెన్సీ వహించే సామర్థ్యం మహీకి ఉంటుందా? క్రికెట్ నుంచి అతను వైదొలగాలని నేను చెప్పడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు ధోనీ అవసరముంది. అతను క్రికెట్లో కొనసాగాలి. అయితే 2019 వరకు అతను కెప్టెన్గా ఉంటాడని నేను భావించడం లేదు. కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టు కెప్టెన్గా అతని రికార్డు బాగుంది. మైదానంలో కోహ్లీ దృక్పథం సూపర్. ఆటలోనే కాదు మానసికంగా కూడా శక్తిమంతంగా కనిపిస్తాడు. కాబట్టి వచ్చే వరల్డ్ కప్నకు ఎవరు కెప్టెన్గా ఉండాలన్నది సెలెక్టర్లు నిర్ణయించుకోవాలి' అని దాదా అన్నాడు.

కాగా గంగూలీ వ్యాఖ్యాల నేపథ్యంలో ధోని అభిమానుల్లో అప్పుడే కలవరం మొదలైంది. తన సారథ్యంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని గత కొన్నాళ్లుగా విమర్శలు ఎదుర్కోంటున్నాడు. తాను అంతకుముందు తరహాలో ఆడిన ఫామ్ కోల్పోయాడని, అతడు అలాగే విఫలమైతే.. ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశాలు మొండుగా వున్నాయని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు సందిస్తున్న తరుణంలో గంగూలీ వ్యాఖ్యలు అసక్తికరంగా మారాయి. పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకుగాను 2014లో టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పినా.. మహీ మునుపటి మాదిరిగా జట్టును విజయపథంలో నడపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మహి అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. ధోని మళ్లీ ఫామ్ లోకి రావాలని తన పూర్వ వైభవం చాటుకుని జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India captain  2019 World Cup  Sourav Ganguly  Cricket  

Other Articles