Team India won the final ODI with Australia

Team india won the final odi with australia

Cricketer, Team India, India, Australia, Indian Team, India won in fifth match

India pinched 13 runs off the final over of the fifth and final one-day international against Australia at the SCG on Saturday night to avoid a series whitewash. The six-wicket victory – India’s first of the five-match series – ended Australia’s 18-game one-day international winning streak at home.

చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం

Posted: 01/23/2016 06:14 PM IST
Team india won the final odi with australia

విజయం కోసం అవురావురుమంటూ ఎదురు చూస్తున్న టీమిండియా అభిమానులకు రిపబ్లిక్ డే గిఫ్ట్ ఇచ్చింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచులు పోగొట్టుకున్న టీమిండియా కనీసం చివరి మ్యాచులోనైనా గెలుస్తుందా అన్న అనుమానాలను పఠాపంచలు చేస్తూ అద్భుతమైన ఆటతో రాణించారు. చివరి బంతి వరకు ఉత్కంఠ భరింతంగా సాగిన వన్డేలో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధిచింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (99), శిఖర్ ధావన్ (76) ధాటిగా ఆడుతూ విజయానికి బాటలు వేశారు. ధావన్ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 8 రన్లు మాత్రమే చేసి వెంటనే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన మనిష్ పాండే 104 పరుగులతొ ఆస్ట్రేలియా టీంకు చుక్కలు చూపించారు.

ఎట్టకేలకు ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి విజయాన్ని సాధించారు. కొత్త ఆగటగాళ్లు టీమిండియా సత్తా ఏంటో నిరూపించారు.  సీనియర్లు చూపిన బాటలో సెంచరీ సాధించి చివరి వన్డేలో గెలిపించి, సిరీస్ క్లీన్ స్వీప్ ను అడ్డుకున్నాడు.  రోహిత్ శర్మ సెంచరీ చెయ్యకుండానే వెనుదిరిగాడు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (78), రోహిత్‌ శర్మ (99) తో మొదటి నుంచి ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 123 పరుగులు జతచేసి విజయానికి బాటలు పరిచారు. ధావన్‌ ఔట్‌  తర్వాత  క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి (8) నిరాశపరిచినా.. మనీశ్‌ పాండే (104) ఎలాంటి తడబాటు లేకుండా గెలుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ (32) చాలా జాగ్రత్తగా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  మొత్తానికి భారత్‌ మరో 2 బంతులు మిగిలి ఉండగానే 331/4 తో విజయాన్ని అందుకుంది.

అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపి భారీ స్కోరులో సహకరించారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.  ఈ జోడీ ప్రత్యేకంగా ఐదో వికెట్ కు 118 పరుగులు నమోదు చేసి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చింది.  మిచెల్ మార్ష్ -వేడ్ ల జోడి ఆరో వికెట్ కు మరో 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆసీస్ మూడొందలకు పైగా స్కోరును చేయగలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricketer  Team India  India  Australia  Indian Team  India won in fifth match  

Other Articles