Jagmohan Dalmiya’s passing away has left a big void in cricket: Javed Miandad

Javed miandad remembers jagmohan dalmiya as the man who strengthened indo pak ties

Indian Cricket,Pakistan Cricket,Cricket,BCCI, jagmohan dalmiya, BCCI president, Sub continent, pakistan, javed miandad, Indo-Pak ties, cricket

Former Pakistan captain Javed Miandad has paid homage to the late Jagmohan Dalmiya, saying he was someone who had a lot of respect for Pakistani cricket and cricketers.

దాల్మియా సేవలు.. ఉపఖండం ఖ్యాతిని పెంచాయి: మియాందాద్

Posted: 09/24/2015 08:11 PM IST
Javed miandad remembers jagmohan dalmiya as the man who strengthened indo pak ties

దివంగత బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా సేవలను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కొనియాడారు. దాల్మియా హఠాన్మరణంపై సంతాపం ప్రకటించిన జావేద్ మియాందాద్.. దాల్మియా భారత దేశః క్రికెట్ కు, క్రికెట్ ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఉపఖండం ప్రతిష్టను దాల్మియా మరింతగా ఇనుమడింపజేశారని పేర్కొన్నాడు. దాల్మియా హఠాన్మరణం.. క్రికెట్‌కు తీరని లోటు మిగిల్చిందని వాపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపఖండ ప్రతిష్ఠను పెంచినవాడిగా దాల్మియాను అందరూ గౌరవిస్తారన్నారు.

దాల్మియా పాక్ క్రికెట్‌కు నిజమైన స్నేహితుడిగా నిలిచారని మియాందాద్ తెలిపారు. 1999లో పాకిస్థాన్ జట్టు కోచ్‌గా భారత్ పర్యటనకు వచ్చానని, ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహాన్ దాల్మియా తమకు అద్భుతమైన అతిథి సత్కారాలు చేశారని జావేద్ మియాందాద్ కొనియాడారు. భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ తోడ్పాడుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఇందుకు నిదర్శనం 1999, 2004లో జరిగిన సిరిస్‌లే ఉదాహారణగా చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagmohan dalmiya  BCCI president  Sub continent  pakistan  javed miandad  cricket  

Other Articles