MS Dhoni an all-time great, no one can match his captaincy: Ravi Shastri

Ravi shastri waxes lyrical on all time great ms dhoni

india vs south africa,Ravi Shastri,MS Dhoni world's greatest ODI batsmen,Virat Kohli,MS Dhoni,MS Dhoni batting position,suresh raina India,MS Dhoni,South Africa in India Series, 2015,Cricket Mahendra Singh Dhoni Is One of the All Time Greats in ODIs, Says Ravi Shastri latest South Africa in India Series, 2015 news

Team Director Ravi Shastri heaped praise on the achievements of MS Dhoni in world cricket, stating the India skipper is one of the all-time greats of limited-overs cricket.

ధోనిపై ప్రశంసలు కురిపించిన రవిశాస్త్రీ

Posted: 09/25/2015 06:36 PM IST
Ravi shastri waxes lyrical on all time great ms dhoni

మూడు నెలల విరామం తరువాత టీమిండియా పగ్గాలను చేప్టటి సమఉజ్జి సఫారీలతో వన్టే.. టీ 20 సిరీస్ లకు మళ్లీ తానే సారధ్యం వహిస్తూ.. అడునున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలోదక్షిణాఫ్రికాతో సిరీస్ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ ధోనీపై ఒత్తిడి పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరికల నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ధోనిపై ఒత్తిడి పడుతుందన్న వార్తలను తోసిపుచ్చుతూ.. టీమిండియాకు ధోని అందించిన రికార్డులే అతని కెప్టెన్సీకి నిదర్శనమంటూ రవిశాస్త్రి వెనుకేసుకొచ్చాడు.

ధోని సారథ్యంలో టీమిండియా ఘనమైన విజయాలు సాధించిందని అయన గుర్తు చేశారు. నిజంగా అతని కెప్టెన్సీ అద్భుతం. ఇక వేరే కెప్టెన్లు ఎవ్వరూ కూడా అతని రికార్డులకు దగ్గరగా వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. వన్డేల్లో ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ధోని కూడా ఒకడని కితాబిచ్చాడు. కెప్టెన్ గా తిరిగి బాధ్యతలు తీసుకోవడం ధోనికి కొత్త కాదని. ఇప్పడు ప్రతీ ఒక్కరూ చాంపియన్ కెప్టెన్ నేతృత్వంలో ఆడతారని అన్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ మాకు ఒక చాలెంజ్. పటిష్టమైన జట్టును సమర్ధవంతంగా ఎదుర్కొంటామని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. రాబోవు కొన్ని నెలల్లో టీమిండియా జట్టు మరింత నిలకడగా ఆడేటట్లు చేయడమే తనముందున్న లక్ష్యమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. టీమిండియా'ఎ' జట్టు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా తమ భవిష్య కార్యాచరణలో సాయపడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని రవిశాస్త్రి తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  MS Dhoni  Ravi Shastri  South Africa vs India 2015  Cricket  

Other Articles