Virat Kohli, Sushil Kumar pledge support on World Environment Day

Virat kohli participate the environmental day

Cricket, World Environment Day, World Environment Day 2015, Virat Kohli, India Test captain Virat Kohli, Prakash Javadekar, Sushil Kumar, Wrestler Sushil Kumar

India's Test captain Virat Kohli called on the youth of the country to come forward and pledge their support to save the environment by planting saplings

పర్యావరణాన్ని పరిరక్షించాలని కోహ్లీ పిలుపు..

Posted: 06/06/2015 07:14 PM IST
Virat kohli participate the environmental day

పర్యావరణాన్ని కాపాడేందుకు భారత ప్రజలు ముఖ్యంగా యువత ముందుకు రావాలని టెస్టు జట్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ జట్టు సారధి విరాట్ కోహ్లి పిలుపునిచ్చాడు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పతిజ్ఞ చేయాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెజ్లర్ సుశీల్ కుమార్‌తో కలసి కోహ్లి పాల్గొన్నాడు.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, విరాట్ కోహ్లి, సుశీల్‌కుమార్ లు ఇందిర పర్యావరణ్ భవన్ వద్ద మొక్కలు నాటి ‘‘సేవ్ ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణాన్ని కాపాడండి)’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక మంచి కార్యక్రమాన్ని తమతో ప్రారంభించినందుకు కోహ్లి, సుశీల్‌లు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువ ఆటగాడు అజింక్య రహానేలు ముంబయిలో, ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్‌లు వడోదరలో మొక్కలు నాటి కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  environmental day  cricketer  

Other Articles