Hyderabad young cricketers ashish reddy ravikiran parternship scrore 128 tenth wicket creates history

hyderabad cricketers, young cricketers ashish reddy ravi kiran, hyderabad cricketer ravi kiran, hyderabad cricketer ashish reddy, hyderabad vs kerala cricket match

hyderabad young cricketers ashish reddy ravikiran parternship scrore 128 tenth wicket creates history

ప్రపంచ క్రికెట్ రికార్డును బద్దలుకొట్టిన తెలుగుకుర్రాళ్లు!

Posted: 11/11/2014 12:26 PM IST
Hyderabad young cricketers ashish reddy ravikiran parternship scrore 128 tenth wicket creates history

ఇంతవరకు క్రికెట్ ప్రపంచంలో బద్దలైన రికార్డులు ఒక ఎత్తయితే.. తెలుగు కుర్రాళ్లు సాధించిన రికార్డును మరో ఎత్తుగా వర్ణించుకోవచ్చు. ఎందుకంటే.. గత 28 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే నమోదైన అత్యంత అరుదైన రికార్డును ఆ తెలుగుబ్బాయిలు బద్దలు కొట్టేశారు. అశిష్ రెడ్డి, రవికిరణ్ అనే ఇద్దరు హైదరాబాదీ కుర్రాళ్లు తమదైన ఆటప్రతిభతో సరికొత్త చరిత్రనే సృష్టించారు.

1984లో ఇంగ్లాండ్ లో జరిగిన వన్డేలో రిచర్డ్స్, హోల్డింగ్ అనే ఇద్దరు ఆటగాళ్లూ కలిసి పదో వికెట్ కు అజేయంగా 106 పరుగులు జోడించి అద్భుతమైన రికార్డును నెలకొల్పారు. సాధారణంగా పదోవికెట్ భాగస్వామ్యంలో వుండే ఇద్దరూ ఆటగాళ్లు బౌలర్లే కాబట్టి వారికి బ్యాటింగ్ మీద అంతగా పట్టు వుండదు. అయితే ఆ ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమలో కూడా బ్యాటింగ్ సత్తా వుందని ఆనాడు 106 పరుగులు చేసి నిరూపించారు. ఇక అప్పటినుంచి ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.

కానీ 28 సంవత్సరాల తర్వాత ఆ అరుదైన రికార్డును ఇద్దరు హైదరాబాదీ అబ్బాయిలు బద్ధలు కొట్టేశారు. అన్నిస్థాయిల పరిమిత ఓవర్ల క్రికెట్ లో పదో వికెట్ కు పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే తమ పేరును ఒక సరికొత్త రికార్డుల్లో చేర్చేసుకున్నారు. సోమవారం సుబ్బయ్య పిళ్లై వన్డే టోర్నీలో కేరళతో మ్యాచ్ లో అశిష్ (119 నాటౌట్), రవికిరణ్ (27) చివరి వికెట్ కు 128 పరుగులు జోడించారు.

కేరళ, హైదరాబాద్ క్రికెట్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట కేరళ బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు మొదట్లోనే కుప్పకూలిపోయారు. ఈ దెబ్బతో 24 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. (అంటే ఓ దశలో హైదరాబాద్ 24 ఓవర్లు 60/9 అన్నమాట!).

అయితే ఆ సమయంలో బ్యాట్ తీసుకుని బరిలోకి దిగిన రవికిరణ్.. ఆశిష్ తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ను రాణించాడు. ఓవైపు రవి సింపుల్ గా ఆడుతూ ఆశిష్ కు సహకరిస్తూ వచ్చాడు. అప్పుడు ఆశిష్ తన దూకుడు పర్ ఫార్మెన్స్ తో భారీ షాట్లతో ముందుకు దూసుకెళ్లాడు. వీరిద్దరు 128 రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 44వ ఓవర్లో రవి కిరణ్ ఔటయ్యాడు. దీంతో ఆ మ్యాచ్ లో హైదరాబాద్ 133 పరుగుల తేడాతో ఓడింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles