Bcci decide chennai super kings fate in ipl

ipl spot-fixing scandal, supreme court, bcci, chennai super kings, rajasthan royals, n srinivasan

SC not BCCI must decide Chennai fate, says S. Kannan

చెన్నై జట్టు కథ కంచికి చేరినట్లే

Posted: 03/10/2014 11:27 AM IST
Bcci decide chennai super kings fate in ipl

‘‘అత్త సొమ్ము అల్లుడు దానం ఇచ్చినట్లు... బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు అయిన గురునాథన్ మునియప్పన్ ఐపీఎల్ జట్టు ‘చెన్నై సూపర్ కింగ్స్ ’ అధికారిగా ఉండి బెట్టింగ్ లకు పాల్పడ్డాడని ఫిక్సింగ్ ఆరోపణల పై వేసిన ముద్గల్ కమిటీ తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీని రద్దు చేసే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది.

చెన్నై జట్టు పై చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీసీఐలోని చాలా మంది వ్యక్తులు నిర్ణయానికి రాడంతో తెర వెనుకు శ్రీనివాసన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించే విధంగా కనిపించడంలేదు. గత కొన్ని రోజులుగా ఫ్రాంచైజీ రద్దు కాకుండా ఉండటానికి శత విధాల ప్రయత్నిస్తున్నాడనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం టోర్నీకి చెడ్డపేరు తెచ్చే పని జట్టు సభ్యలు, అధికారులు గానీ చేస్తే ఆ ఫ్రాంచైజీని రద్దు చేస్తారు.

మునియప్పన్ ఎప్పుడో దోషిగా తేలినా జట్టు పై ఇంత వరకు చర్యలు తీసుకోలేదంటే తెర వెనుక శ్రీనివాసన్ ప్రయత్నాలు ఏ మేరకు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఐపీఎల్ వేలం, షెడ్యూలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఈసారి సీజన్ నుండి ఈ జట్టును తప్పించే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles