Kohli smashed new zealand bowlers in 1st odi

India vs New Zealand 2014, new zealand vs india 1st odi match, Highlights New Zealand v India 1st ODI, India vs New Zealand Live Cricket Score, cricker news, kohli smashed new zealand bowlers in 1st odi

India vs New Zealand 2014 Highlights

ఇన్నింగ్స్ ఓడినా ఇరగదీనిన కోహ్లీ

Posted: 01/20/2014 04:22 PM IST
Kohli smashed new zealand bowlers in 1st odi

(Image source from: ఇన్నింగ్స్ ఓడినా ఇరగదీనిన కోహ్లీ)

కివీస్ పర్యటన ఓటమితోనే ఆరంభమైంది. అయితేనేం విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిచాడు. కోహ్లీ ఆటలో తన సత్తనంతా చూపి ఆడి నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అదే విధంగా ధోని కూడా ఆట విజయానికి సహకరించినా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో భారత్ ఆదివారం తొలి వన్డ్ లో న్యూజిలాండ్ చేతిలో పరాభవం పాలైంది. 293 పరుగుల సాధనలో భారత్ 48.4 ఓవర్లలో 266 పరుగులకే ఆల్ అవుట్ అయ్యుంది. కోరె అండర్సన్ (68 నాటౌట్), విలియమ్స్ (71) దిశగా చెలరేగడంలో ముందు కివీస్ 7 వికెట్లకు 292 పరుగులు చేసింది. అయితే 28.2 ఓవర్లలో భారత్ రన్ రేట్ బాగా పెరిగింది. దీనికి తోడు కోహ్లీ , ధోనీలు అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పరుగుల వర్షం మొదలైంది.

 

ఈ సమయంలో మెక్లెగన్ మూడు వికెట్లు తీసి భారత్ కు సవాలు విసిరాడు. దీంతో భారత్ టీమ్ లో కోహ్లీపైనే ఆశలు నెలకొన్నాయి. అయితే మెక్లనగన్ , విరాట్ ను కూడా అవుట్ చేశాడు. మొత్తానికి 44 పరుగులకే భారత్ చివరి వికెట్ ను చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీకి సరైన సహకారమే కరువైంది. రోహిత్ శర్మ తడబడ్డాడు. ధావన్ నెమ్మదితనం కొంపముంచింది. దోనీ అవుటయ్యాక వచ్చిన జడేజా మూడో బంతికే అవుటయ్యాడు. అయితే కోహ్లీ ఈ మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబరిచి శభా ష్ అనిపించుకోవడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles