ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గత కొన్ని రోజులుగా వార్తల్లో కనిపించడం లేదు. క్రికెట్ కి గుడ్ బై చెప్పి చక్కగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటున్నారా ? గతంలో పలుమార్లు వివాదాల్లో ఇరుక్కొని హైలెట్ అయిన వార్న్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ఈయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత బ్రిటన్ ఎలిజబెత్ హ్యారీతో ప్రేమాయణం నడిపి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరు తమ బంధాన్ని, సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తుంది. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్.. బ్రిటన్ లో ఎలిజబెత్ హ్యరీలు గడపాల్సి రావడంతో కుటుంబ జీవితాన్ని ఎక్కువ శాతం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లోనే పంచుకోవాల్సి వచ్చిందట. దీంతో విసిగి వేసారిన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికారు చేస్తున్నాయి. పెళ్ళి తరువాత వీరి లైంగిక జీవితానికి ప్రొఫెషనల్ లైఫ్ అడ్డు రావడమే కారణం అంటున్నారు. పలుమార్లు వీరిద్దరూ సర్దుకుపోదామని అనుకున్నా.. వీరి మధ్య దూరం పెరగడంతో మూడేళ్ల రిలేషన్ షిప్ కు రెండేళ్ల వివాహబంధానికి తెరపడింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అరుణ్ నాయర్ తో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాకా 2010లో షేన్ వార్న్ తో డేటింగ్ ప్రారంభించింది. ఆతర్వాత ఓ సంవత్సరం తర్వాత హ్యర్లీని వార్న్ ను పెళ్లాడారు. ఇప్పుడు వార్న్ మరొకర్ని చూసుకోవడం ఖాయం అంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more