ప్రపంచ విధ్వంసక బ్యాట్ వీరుల మెరుపులు.. స్టార్ బౌలర్ల మాయాజాలం.. ఆల్‌రౌండర్ల నైపుణ్యం.. అబ్బుర పరిచే ఫీల్డింగ్ విన్యాసాలు.. సంచలనాలు.. ఇలా 20 రోజుల పాటు అభిమానులను కనువిందు చేస్తూ, పరుగుల తుపానులో హోరెత్తించడానికి పొట్టి క్రికెట్ పండుగ వచ్చేసింది. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచ కప్ సమరం నేటినుంచే. ....గతేడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ సమరం మిగిల్చిన మధుర స్మృతులు మదిలో ఇంకా కదలాడుతుండగానే.. ఉపఖండంలో మరోసారి విశ్వ క్రికెట్ సంబరం వచ్చేసింది.
నాలుగో టి-20 ప్రపంచ కప్ పోరుకు సర్వం సిద్ధం. ఈ మెగా ఈవెంట్ మంగళవారం శ్రీలంకలో ప్రారంభమవుతోంది. ఆతిథ్య జట్టు లంక, డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, మాజీ చాంపియన్లు భారత్, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్ అగ్రశ్రేణి జట్లుగా బరిలోకి దిగుతున్నాయి. ఇక బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ సంచనాలు సృష్టించేందుకు రెడీ అయ్యాయి. ఈ ఈవెంట్‌లో భారత్.. ఇంగ్లండ్, క్వాలిఫయర్ ఆఫ్ఘనిస్థాన్‌తో కలసి గ్రూప్-ఎలో రెండో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. కాగా అనూహ్య ఫలితాలకు, సంచలనాలకు మారుపేరైన పొట్టి క్రికెట్లో ఏయే జట్లు ఫేవరెట్లన్నది ఊహించడం కష్టం.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more