ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు చికిత్స చివరి దశకు చేరుకుంది. అరుదైన జెర్మ్ సెల్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో కీమోథెరపీ చేయించుకుంటున్న విషయం విదితమే. మరో నాలుగు రోజుల్లో తనకు కీమోథెరపీ పూర్తవుతుందని యువరాజ్ సింగ్ ‘ట్విట్టర్’ ద్వారా అభిమానులకు శుభవార్త పంపాడు. ‘మరో నాలుగు రోజుల్లో నాకు కీమోథెరపీ పూర్తవుతుంది. ఇంత త్వరగా స్వస్థత చేకూర్చిన భగవంతుడికి, నా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రార్ధనలు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని యువీ ఆ సందేశంలో పేర్కొన్నాడు. ఊపిరితిత్తుల మధ్య ఏర్పడిన కణితి దాదాపు పూర్తిగా నయమైపోయిందని యువరాజ్ సింగ్ గత నెలలోనే అభిమానులకు తెలియజేశాడు. క్యాన్సర్ వ్యాధి నుంచి వేగంగా కోలుకుంటున్న యువరాజ్ సింగ్ మే నెల మొదటి వారానికల్లా మళ్లీ బ్యాట్ చేతబట్టుకుని మైదానంలోకి దిగుతాడని భావిస్తున్నట్టు అతని వైద్యుడు తెలిపాడు. మరో నాలుగైదు రోజుల్లో కీమోథెరపీ పూర్తయినప్పటికీ ఈ నెల చివరి వారం వరకు యువరాజ్‌కు చికిత్స కొనసాగుతుందని, ఏప్రిల్‌లో అతనికి రిహాబిలిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వైద్యులు తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడిన తర్వాత యువరాజ్‌కు క్యాన్సర్ వ్యాధి సోకినట్టు వైద్యులు తేల్చారు. దీంతో అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న యువీ గత నెల నుంచి బోస్టన్‌లో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more