క్యారెట్ జ్యూస్
ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇవి బ్లడ్ కొలెస్ర్టాల్ తగ్గించడంలో సహకరిస్తాయి. అంతేకాదు.. రక్తపీడనం అంటే బీపీని కంట్రోల్ చేయడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఈ క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. మధుమేహం, బీపీ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తాగితే ఎంతో శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.