గజేంద్ర ఘడ్
ఉత్తర కర్నాటక జిల్లా అయిన గడగ్ లోని గజేంద్ర ఘడ్ లోని ఆలయాన్ని దక్షిణ కాశి అని పిలుస్తారు. గుడికి సమీపంలో వెలుపలి వైపుగా నిరంతరం నీరు వుండే ఒక కొలను లేదా దిగుడు బావి ఉంది. ఈ నీరు ఎక్కడనుండి ప్రవహిస్తుంది అనేది ఒక మిస్టరీ. ఇంకో మిస్టరీ లోకి వస్తే... ప్రతి సంవత్సరం వచ్చే కన్నడ ఉగాది పండుగ ముందు రోజు టెంపుల్ పూజారి తన డ్యూటీగా ఒక హుక్కా, కొంత సున్నపు నీరు అక్కడ వుంచుతాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే, ఎవరికీ అర్ధం కాని రీతిలో టెంపుల్ గోడల లోపలి భాగం అంతా సున్నం వేయబడి వుంటుంది. దీని పట్ల కొంత మంది ఆసక్తి చూపిన అంతు పట్టలేదు.