నలంద
బీహార్లోని పాట్నాలో వున్న విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలో వున్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. క్రీ.శ. 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. లిఖిత చరిత్రలో ఇది ప్రపంచంలోనే తొలి విశ్వవిదాలయం. టిబెట్, చైనా, టర్కీ, గ్రీసు, పర్షియా మొదలైన ప్రాంతాల నుండి విద్యార్థులు, పండితులు జ్ఞానం కోసం ఇక్కడికి వచ్చేవారు.