ప్రతిభా పాటిల్
ఈమె భారతదేశపు 12వ రాష్ట్రపతి. భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన మహిళగా ఈమె చరిత్రకెక్కారు. ఈమె అబ్దుల్ కలామ్ నుంచి రాష్ట్రపతిగా 2007 జూలై 25వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. 2007 జూలై 19వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ తన సమీప ప్రత్యర్థి అయిన బైరాంసింగ్ షెకాత్ పై 3,00,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.