మీరా కుమార్
1985లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించిన ఈమె... లోక్ సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షరాలు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేశారు. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొన్నాళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఈమె ఈ పదవిలో వుండగానే లోక్ సభ సభాపతిగా ఎన్నుకోబడడంతో ఆ పదవికి రాజీనామా చేశారు.