ఫాతిమా బీవీ
కేరళలో ఒక న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఫాతిమా బీవీ... ఆ తరువాత 1989 అక్బోబర్ 5వ తేదీన భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమించబడి ఖ్యాతిని పొందారు. మనదేశంలో ఇటువంటి అత్యున్నత స్థానాన్ని పొందిన మొదటి ముస్లిం మహిళ కూడా! అలాగే తమిళనాడు గవర్నరుగా కూడా ఈమె తమ సేవలను అందించారు.