ఇందిరా గాంధీ
భారతదేశానికి తొలి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె అయిన ఇందిరాగాంధీ... రాజకీయరంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి చరిత్ర రికార్డుల్లో ఎక్కిపోయారు. అలాగే 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు అయిన ‘‘భారతరత్న’’ పురస్కారాన్ని స్వీకరించిన మొదటిమహిళగా స్థానం కల్పించుకున్నారు.