Debitor died

debitor died.png

Posted: 03/08/2013 07:36 PM IST
Debitor died

lawనా దగ్గర ఒక వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం లక్షా యాభై వేల రూపాయలు నూటికి రెండు రూపాయల చొప్పున వడ్డీ ఇస్తానని చెప్పి మొత్తం సొమ్ము తిరిగి ఆరు మాసాలలో ఇచ్చివేస్తానని చెప్పి గతంలో ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. వ్రాసి ఇచ్చిన 18 నెలలకే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే నేను వారి కుటుంబ సభ్యులను అడగగా... వారు తమకు సంబంధం లేదని, అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి తాము డబ్బులు చెల్లించవలసినదేమీ లేదని వాదిస్తున్నారు. దీనికి పరిష్కారమార్గం చూపగలరు.

మీరిచ్చిన అప్పు దేని నిమిత్తం ఇచ్చారో చెప్పలేదు. ప్రామిసరీ నోటులోని సాక్షుల సంతకం గూర్చి మీరు వివరించలేదు. అలాగే జమానత్‌ (ష్యూరిటీ) సంతకం తీసుకున్నట్టు చెప్పలేదు. మీరిచ్చిన అప్పు సొంత ఖర్చుల నిమిత్తం ఇచ్చినట్టు రాసినా... ప్రామిసరీ నోటు అయినచో తిరిగిరావు. అదే విధంగా పిల్లల చదువుల నిమిత్తం, వైద్య ఆరోగ్యం నిమిత్తం లేక కుటుంబ అవసరాల నిమిత్తం అయినచో మీరు తప్పక కోర్టు ద్వారా వారి కుటుంబ వారసుల ద్వారా అనగా... భార్య లేక సంతానం ద్వారా కుటుంబ వారసులను భాగస్వాములను చేస్తూ... దావా వేసినచో తప్పక మీరిచ్చిన అప్పు తిరిగి వడ్డీతో సహా కోర్టు ఖర్చులు కలుపుకొని రాబట్టుకునే అవకాశము కలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Legal advice for property law
Assigned lands act  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles