Assigned lands act

assigned lands act

assigned lands act

assigned lands act.png

Posted: 03/01/2013 02:53 PM IST
Assigned lands act

assigned_landsపదేళ్ళక్రితం నేను హైదరాబాద్‌ లో ఐదెకరాల భూమి కొని రిజిష్ట్రేషన్‌ చేయించుకున్నాను. ఆ తరువాత మ్యూటేషన్‌ అనగా పేరు మార్పిడి చేయించుకొని, పాస్‌ పుస్తకం తీసుకొన్నాను. అదే విధంగా పహణి, కాసర లో కూడా నా పేరు మార్చుకొని వ్యవసాయ నిమిత్తం కౌలుదారుకి ఇచ్చినాను. ఈ మధ్య లో (3, 4 సంవత్సరముల క్రితం) భూమి రేట్లు పెరగడంతో, ఒక బిల్డర్‌తో నా వ్యవసా య భూమిని అభివృద్ధి చేసి ఇళ్ల స్థలాలుగా ప్లాట్లు చేసి అమ్మే విధంగా ఒప్పందం చేసుకొని అతనికి నా భూమిని అమ్మినాను. ఈ మధ్యకాలంలో మండల రెవెన్యూ అధికారి ఒక నోటీసు పంపించాడు.‘నా పేరుతో ఉన్న పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్‌, పహణి, కాసర మొదలగునవి ఎందుకు రద్దు చేయకూడదో 10 రోజులలో వివరణ ఇవ్వవలెనని లేదంటే అవి రద్దు అయినట్లు భావించాలని’ అందులో రాసి ఉంది.నేను ఈ నోటీసు తీసుకొని మండల రెవెన్యూ అధికారిని కలవగా, మీరు తీసుకున్న భూమి, ప్రభుత్వం అసైన్డ్‌ చేసిన స్థలం. కాబట్టి ఆ భూమిని వదులుకోమని చెప్పాడు. ఇంతకీ అసైన్డ్‌ భూమి అంటే ఏమిటి? లావని పట్టా అంటే ఏమిటి? ఇలాంటి భూములు ఇంకా ఎన్ని రకాలు? వాటిని ఎలా గుర్తించాలి? నేను కొన్ని భూమిని నాకు అమ్మిన వ్యక్తి ఐదేళ్ళక్రితమే రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది. దయచేసి నాకు న్యాయ సలహా ఇవ్వగలరు.

ఎంతోమంది ఇలాంటి భూముల్ని కొని మీలాగే మోసపోతున్నారు. ఇంకా కొంత మంది న్యాయసలహ తీసుకొని కూడా మోసపోతున్నారు. కారణం వారు తీసుకొన్న న్యాయ సలహా సరిగా లేకపోవడం. కావున ఎవరైనా భూములు కాని, ఇళ్ల స్థలాలు కొనే ముందు ఇక నుంచి మంచి అనుభవజ్ఞుడైన న్యాయవాది దగ్గరికెళ్ళి సలహా తీసుకోవాలి. ఏదైనా భూమిని కొనేముందు, ఎన్ని సంత్సరాల క్రితం రిజిష్ట్రేషన్‌ జరిగింది, కొనే తేదీ వరకు ఎవరిపేరున రిజిస్టర్‌ అయివుంది అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. దీనికోసం మండల రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్ళి... కనీసం గత 40 సంవత్సరాల రెవెన్యూ రికార్డులను పరిశీలించాలి. దానిలో గల భూమి స్వభావాన్ని బట్టి ఆ భూమి ఎలాంటిది అని చెప్పవచ్చును. దాని ఆధారంగా న్యాయ సలహా తీసుకొని, ఆ భూమి క్రయ విక్రయాలు జరపవచ్చా లేదా అనే విషయం నిర్ధారించుకోవాలి. ఈ విషయం మీరు పొందే న్యాయ సలహా మీద ఆధారపడి ఉంటుంది.ఇక మీరు అసైన్డ్‌ భూమి గురించి చెప్పమని రాశారు. అసైన్డ్‌ భూమి అనగా ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు, స్వాతంత్య్ర సమరయోదులకు, రాజకీయ బాధితులకు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఇచ్చే భూమి. అదేవిధంగా ప్రభుత్వానికి మొదటి నుండి ఉన్న భూములను సర్కారీ భూములు లేదా పోరంబోకు భూములు అంటారు. అదేవిధంగా సీలింగ్‌ భూములు అనగా ఒక కుటుంబ యజమానికి ప్రభుత్వం నిర్ణయించునట్లు 20 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూముల్ని మిగులుగా గుర్తించే వాటినే సీలింగ్‌ భూములంటారు. దీనిని అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ ద్వారా మిగులుగా పెర్కొన్న భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తా రు. మరి వీటిని గుర్తించడం ఎలా అనగా చత్వార్‌ అంటే అసలైన సర్వే రికార్డులో చూసి తెలుసుకోవచ్చు.

మనం కొనే భూమికి సంబందించిన సర్వేనెంబర్‌, ప్రభుత్వ భూమి (సర్కారీ లేదా పోరంబోకు) అనే విషయం తెలుస్తుంది. అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ కార్యాల యంలో వ్యవసాయ భూమిలో మిగులు కింద ప్రకటించినవి ఫైసల్‌పట్టీని చూడటం ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది.అసలు అసైన్డ్‌ భూములను, ఎందుకు కొనకూడదు అనగా భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఎన్నటికీ కొనడానికి వీలులేదు. ఉదాహరణకు మన ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చినటువంటి డీ పట్టా కాని రాజీవ్‌ గృహకల్ప ఇళ్లు కాని, ఎన్ని సంవత్సరాలైనా అమ్మడం కొనడం కాని నేరం. ఇలాంటి భూములను ప్రభుత్వం ఇచ్చిన భూములని, లావాటి పట్టగా అంటాం. అదేవిధంగా, స్వాతంత్ర సమరయోధులకు, రాజకీయ బాధితులకు, ఎక్స్‌ సర్వీసుమెన్‌లకు, ప్రభు త్వం కేటాయించిన భూములను సాధారణం గా 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా కొనుగోలు చేసే వీలుంటుంది. ప్రభుత్వం కేటాయించిన సమయంలో ఎలాంటి నిబంధనలను విధించినది అనే విషయం చూసుకోవలెను. అసైన్డ్‌ చేయబడిన భూమిని వంశపారం పర్యంగా అనుభవించాలి. కాని, అమ్మకూడదు అసైన్డ్‌ పొందిన భూమిని ఆ తేది నుండి 3 సంవత్సరం లోపు భూమిని సాగులోకి తీసుకురావలెను. అలా చేయని పక్షంలో ఆ భూమి ప్రభుత్వానికి చెందు తుంది. దీని ప్రకారం మీ భూమి ఎప్పటికీ మీకు చెందదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Debitor died
Divorce laws  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles