తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొని మరీ బరిలో దిగాడేమో, ఎలాంటి స్టెప్పులైనా చిటికెలో చేసేస్తాడు యంగ్ టైగర్. మెరుపు కంటే వేగంగా కాలు, స్ప్రింగ్ లా శరీరాన్ని వంచగలిగిన సత్తా ఉన్న నటుడు. ఇప్పుడు ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ సినిమాలోనూ అలాంటి స్టెప్పులతోనే అదరగొట్టబోతున్నాడట.
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇటీవలే చెన్నైలో షూటింగ్ ని ముగించుకుని హైదరాబాద్ కి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ , సమంతలపై ఓగీతాన్ని తెరకెక్కిస్తున్నాడు డ్యాన్స్ మాస్టర్ శేఖర్. ఈ పాట కోసం కళా దర్శకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో నాలుగు సెట్లు వేశారు. ‘‘డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటాడు. అందుకే సెట్ లో ఒకరోజు ముందుగానే డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టాడట. ఈ ప్రాక్టీస్ స్టెప్పులు చూసిన ఈ పాట గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి ఎన్టీఆర్ ఎనర్జీని చూసి షాకయ్యాడట.
ప్రాక్టీస్ లోనే ఈరకంగా స్టెప్పులు వేస్తే కెమెరా ముందు యాక్షన్ అంటే స్టేజ్ అదిరిపోతుందేమో అంటూ తారక్ ని తెగ పొగిడేశాడు. ఇక తారక్ సరసన స్టెప్పులు వేయాలంటే సమంత , నిత్యామీనన్ లు ఎంత కష్టపడాలో అప్పుడు అర్ధమైంది శాస్త్రిగారికి. దీనికి తోడు సమంత ట్విట్టర్ లో సైతం తారక్ తో డ్యాన్స్ అంటే మాటలు కాదని, చాలా ప్రాక్టీస్ అవసరమని ట్వీట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు అందరి దృష్టి జనతాగ్యారేజ్ పై పడింది. సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందో, దానికి తారక్ ఎలాంటి స్టెప్పులు వేసాడో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more