దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సౌత్ ఇండియాలో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్ తో, అత్యాధునిక సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని మొదటి భాగాన్ని మే 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.
అయితే విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ఆడియోను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని వినూత్న రీతిలో ఏర్పాటు చేయాలని ‘బాహుబలి’ చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నట్లుగా తెలిసింది.
ఇందుకోసం ఈ మూడు భాషలలోని ‘బాహుబలి’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మూడు వేడుకలపై ఘనంగా జరుపనున్నారని టాక్ వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం... ఈ మూడు భాషల ఆడియోలను కూడా ఒకే వేదికపై.. ఈ మూడు భాషలకు సంబంధించిన స్టార్ హీరోల సమక్షంలో ఆడియో విడుదల కార్యక్రమం జరుపనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more