Nayanatara latest gossips romance tollywood hero balakrishna

nayanatara news, nayanatara gossips, nayanatara love affairs, nayanatara hot videos, nayanatara romance, nayanatara affairs news, nayanatara photo shoot, nayanatara hot photos, nayanatara hot images, balakrishna latest news, balakrishna movies, nayana balayya hot videos, balakrishna nayanatara hot videos, balayya nayanatara movies

nayanatara latest gossips romance tollywood hero balakrishna : After long time.. nayanatara to pair again with nandamuri balakrishna in his 99 movie which is to be directed srinivas.

మళ్లీ ఆ హీరోతోనే నయన రొమాన్స్ షురూ...

Posted: 01/23/2015 11:27 AM IST
Nayanatara latest gossips romance tollywood hero balakrishna

గతకొన్నాళ్ల క్రితం ఓ హీరోతో రొమాన్స్ చేసి విడిపోయిన నయనతార.. మళ్లీ అతని చెంతకు చేరిందని ఇండస్ట్రీలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఆ మధ్య ఓ సినిమాలో భాగంగా కలిసిన వీరిద్దరు.. తమ ఆన్’స్ర్కీన్ కెమిస్ట్రీతోనే ప్రేక్షకులను కట్టిపడేశారు. వారిద్దరూ కలిసి పనిచేసిన ఆ తొలిసినిమాతోనే ‘హిట్ పెయిర్’గా పేరు సాధించారు కూడా! అలా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఆ జంట మళ్లీ మరో చిత్రంలో నటించింది. ఆ సినిమాలో కూడా ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదరడంతోబాటు మూవీ భారీ హిట్ సాధించడంతో ఈ జంటకు ప్రశంసల వర్షం కురిసింది. తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతోపాటు ఇద్దరీమధ్యా మంచి కెమెస్ట్రీ కుదరడంతో వారిద్దరూ కలిసి మరిన్ని చిత్రాల్లో నటిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల నయన మళ్లీ ఆ హీరోతో కలిసి పనిచేయలేదు. చాలాకాలం అతనితో దూరం పాటించింది. అయితే చివరగా ఎలాగోలా మళ్లీ ఇన్నాళ్లకు అతనితో ఓ మూవీ చేయడానికి అమ్మడు ఒప్పుకుందని సమాచారం! ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ!

బాలయ్య, నయనతార ఇద్దరూ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ అనే మూవీల్లో నటించిన విషయం తెలిసిందే! ఆ రెండు చిత్రాలు భారీగా హిట్ అవడంతోపాటు వాటిలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరింది. దీంతో వీరి కాంబినేషన్’కి టాలీవుడ్ ‘హిట్ పెయిర్’గా ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే.. ఆ రెండు సినిమాలు చేసిన తర్వాత వీరిద్దరి మళ్లీ కలిసి నటించలేదు. తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా వుండటంతో అమ్మడు టాలీవుడ్’కి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మూవీ షూటింగులన్నీ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు టాలీవుడ్’వైపు తన దృష్టిని మళ్లించినట్లు కనిపిస్తోంది. దాంతో ఈ అమ్మడు బాలయ్య 99వ చిత్రంలో ఓ కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకుందని ఇండస్ట్రీలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే.. గత సినిమాలకంటే ఈ మూవీ వీరిమధ్య కెమిస్ట్రీ ఇంకా బాగా కుదరే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం!

ఇదిలావుండగా.. ‘లౌక్యం’ ఫేం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు గతకొన్నిరోజులుగా సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ మూవీకి కోన వెంకట్, గోపీ మోహన్ సంయుక్తంగా డైలాగులు రాయనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో ఓ కథానాయికగా నయనతార దాదాపు ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఇక రెండో తార వేటలో యూనిట్ బృందం వుందని టాక్! ఇక ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘లయన్’ చిత్రం షూటింగ్ పూర్తికాగానే.. ఈ తాజా చిత్రం సెట్స్’పైకి వెళ్లనుంది. అయితే.. నయన ఇందులో హీరోయిన్’గా ఫిక్స్ అయినట్లు ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanatara affairs news  balakrishna movies  tollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more