గతంలో సెక్సీ నటి శృతిహాసన్, భారత్ డ్యాషింగ్ క్రికెటర్ అయిన సురేష్ రైనాల మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు షికార్లు చేశాయి. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని.. త్వరలోనే వారు తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టనున్నారనే నేపథ్యంలో... ఇద్దరు తమ మధ్య ఎటువంటి బంధం లేదంటూ ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే! ఏదో అప్పుడప్పుడు సరదాగా వుండటం కోసం ఇలా కలుస్తుంటాం! దానిని మీరు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ’’ గుర్రుగా మీడియాకు స్పష్టం చేశారు.
అయితే తాజా వార్తల ప్రకారం వీరిద్దరూ ఘాఢంగా ప్రేమించుకుంటున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుస్తున్నారని, ఫోన్ల సంభాషణల్లోనే తమ ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిద్దరికీ సన్నిహితంగా వుండే కొంతమంది వ్యక్తులు వారిమధ్య వున్న బంధం గురించి ఇలా పెదవి విరుస్తున్నారు. త్వరలోనే వీరు అధికారికంగా తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టబోతున్నట్టు తాజా సమాచారాలు వెలువడుతున్నాయి.
అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం వారిమధ్య ప్రేమ చిగురించి కేవలం కొద్ది కాలాలు మాత్రమే అవుతోందని.. అందుకే వారు దీనిని చాలా రహస్యంగా వుంచుకోవాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఏవిధంగా అయితే అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ తమ ప్రేమ వ్యవహారం గురించి ప్రపంచంతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదో.. శృతి - సురేష్ రైనాలు కూడా తమ ప్రేమ విషయం గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని వీరి సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
అలాగే శృతి, సురేష్ రైనాలు కూడా పర్సనల్ లైఫ్ ( ప్రేమ వ్యవహారం) మీద కంటే తమ కెరీర్ ని మెరుగుపరుచుకోవడంలోనే తమ దృష్టిని కేటాయిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం అటు బాలీవుడ్ తోపాటు సౌత్ లో కూడా పలు సినిమాలతో బిజీగా వుండగా... సురేష్ రైనా కూడా క్రికెట్ మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ తమ కెరీర్ ని మెరుగుపరుచుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఈ విషయం మీద ఇంకా శృతిహాసన్, సురేష్ రైనాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more