Vikram first song Mathuga Mathuga lyrical out విశ్వనటుడు ‘విక్రమ్’ నుంచి మత్తుగా, మత్తుతా లిరికల్ సాంగ్..!

Kamal haasan s vikram mathuga mathuga lyrical song out

Vikram Hitlist, ‘Mathuga Mathuga’, Lyrical song, first Single, Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil, Lokesh Kanagaraj, Anirudh Ravichander, R.Mahendran, Vikram Kamal Hasan movie, vikram trailer, anirudh bgm, vikram telugu trailer, vikram movie telugu trailer, kamal new telugu movie trailer, Tollywood, Movies, Entertainment

Kamal Haasan and director Lokesh Kanagaraj’s most awaited action thriller Vikram has raised expectations with its intense and action-packed trailer. Now, the team has begun musical promotions by releasing lyrical video of first single. The Song ‘Mathuga Mathuga’ is a number scored by Anirudh Ravi chander. The beat is quite thumping and Kamal Haasan shows his grace with his dance moves in the song, particularly masses will love the shirt over head step.

విశ్వనటుడు ‘విక్రమ్’ నుంచి మత్తుగా, మత్తుతా లిరికల్ సాంగ్..!

Posted: 05/27/2022 07:15 PM IST
Kamal haasan s vikram mathuga mathuga lyrical song out

ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా నటించే కమల్.. ఈ మధ్యకాలంలో యాక్షన్ చిత్రాలకు ప్రాధన్యత ఇస్తున్నారు. అలాంటి ఒక కథతోనే ఆయన త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు. లుక్ పరంగా .. క్యారెక్టరైజేషన్ పరంగా కమల్ కొత్తగా కనిపిస్తున్న ఆ సినిమాయే 'విక్రమ్'. తన సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు కమల్.

'ఖైదీ' .. ' మాస్టర్' సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గ‌తేడాది విడుద‌లైన టైటిల్ టీజ‌ర్ నుంచి ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్‌ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌టి ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అంతకంత‌కూ పెంచుతున్నాయి. గ‌త‌కొంత కాలంగా క‌మ‌ల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్ర‌మంలో టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు మ‌ళ్ళీ అప్ప‌టి క‌మ‌ల్‌ను గుర్తుచేస్తున్నాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్‌3న విడుద‌ల కానుంది.

ఈ క్ర‌మంలో చిత్రబృందం త‌ర‌చూ ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కులను ప‌లక‌రిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మ‌త్తుగా మ‌త్తుగా’ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. చంద్ర‌బోస్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను క‌మ‌ల్ ఆల‌పించాడు. ఈ పాట‌లో క‌మ‌ల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య  గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతంఅందించాడు. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles