Chiranjeevi meets Venkaiah Naidu హస్తినకు వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రధానితో భేటీ..

Megastar chiranjeevi meets vice president m venkaiah naidu in new delhi

Megastar Chiranjeevi, pm modi, venkaiah naidu, ganta srinivasa rao, Konidela surekha, Sye raa Narasimha Reddy, YS Jagan, chief minister, ram charan, historical movie, Andhra pradesh, Politics, Tollywood, movies, Entertainment

Tollywood Megastar Chiranjeevi met Vice President Venkaiah Naidu at his official residence in New Delhi. Mega Star has learned to have invited the Vice President to watch his latest Outing Sye Raa Narasimha Reddy.

ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

Posted: 10/16/2019 11:00 PM IST
Megastar chiranjeevi meets vice president m venkaiah naidu in new delhi

మెగాస్టార్ చిరంజీవి చిత్రం రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన స్వయంకృషితో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన తరుణంలో అనేక అటుపోట్లను చూసినా.. ఏ రోజు తన చిత్రాన్ని వీక్షించాలని ఏ రాజకీయ నేతనూ కోరలేదు. అలాంటిది చిత్రరంగంలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా వున్న ఆయన.. చిత్రసీమలో ఫుల్ బిజీగా వున్నారు. అయితే తన చలనచిత్ర కెరీర్లో తొలిసారిగా నటించిన చారిత్రక చిత్రాన్ని చూడాలని ఆయన రాజకీయ నేతలను కోరుతున్నారు.

రెండు రోజుల కిందటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసి ఈ మేరకు విన్నవించిన ఆయన తాజగా హస్తినకు వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడి కుటుంబసభ్యులతో కలసి సమావేశమైన క్షేమసమాచారాలు అడిగి తెలుసుకన్నారు. ఇక హస్తినకు వచ్చిన పనిలో భాగంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వీక్షించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చిరంజీవి కోరారు.

ఢిల్లీకి వెళ్లిన చిరంజీవి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కూడా కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధాని అపాయింట్ మెంట్ లభ్యతను బట్టే ఆయన ప్రధానిని కలువనున్నారు. దేశ స్వతంత్ర సంగ్రామ తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాను వీక్షించాలని ప్రధానిని కోరనున్నారు చిరంజీవి. అయితే వీరిరువురి భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేకుండా కేవలం నటుడిగానే చిరంజీవి ప్రధానితో భేటీ అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఆకట్టుకోగా, ఆయన నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మళయాల భాషల్లో సినిమా విడుదలైన ఈ చిత్రానికి తెలుగువారిన నుంచి వచ్చిన స్పందన.. మిగతా బాషల్లో అశించిన మేర రావడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles