Komaram Bheem Jayanti - RRR Buzzing కొమరం భీం జయంతి - RRR సందడి

Komaram bheem jayanti rrr buzzing

Komaram Bheem, RRR, Jr NTR

Komaram Bheem Jayanti - RRR Buzzing

కొమరం భీం జయంతి - RRR సందడి

Posted: 10/22/2019 02:41 PM IST
Komaram bheem jayanti rrr buzzing

నిజాం సర్కార్  నిరంకుశతత్వాన్నికి    ఎదురుతిరిగి నిలబడిన మన తెలంగాణ వీరుడు కొమరం భీం.. అటువంటి చరిత్రకారుడు చరిత్ర వింటేనే  మది  పులకిస్తుంది . మరి కళ్ళకు కు  కట్టినట్టు  దర్శనం ఇస్తే మన  రెండు రాష్ట్రాల ప్రజలకు విందే.. మన తెలుగు దేశ ఖ్యాతిని ప్రపంచ సరిహద్దులకు పరిచయం చేసిన దర్శకనేత రాజమౌళి గారి  సారధ్యంలో జూనియర్ ఎన్టీఆర్  గారు కొమరం భీం పాత్రలో మన ముందుకు రానున్నారు..మరియు ఒక  ప్రత్యేక పాత్రలో మన  మగధీరుడు రాంచరణ్ గారు  కూడా మనల్ని కనువిందుచేస్తున్నారు..

అంతేకాకుండా అంతర్జాతీయ నటి   డైసీ ఎడ్గార్ జోన్స్ కూడా ఒక ప్రాముఖ్య పాత్రతో మనముందుకు రానున్నారు.. బాలీవుడ్ నటి తన అమాయకమైన చుపురులతో,సహజ నటనతో రంజింపజేసినా  అలియాభట్ కూడా నటించనున్నారు..ఇంతటి భారీ నటన కౌశల్యా ల చలనచిత్రం కై వేచి ఉండడం  తప్పదు మరీ . 1920 సంవత్సరాల నడుమ జరిగిన ఓ జానపద చారిత్రాత్మక  చిత్రంగా  మనముందుకు రానున్నది. అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం ఇరువురి కథల నేపధ్యం , వారి సామర్ధ్యం గూర్చి  ,వారి ధైర్యం సాహసాల వర్ణన మనం చూడగలం..

నేడు కొమరం భీం జన్మదిన వేడుకను పురస్కరించుకొని  ఈ  విషయం   సినీరంగప్రియులకు ,జూనియర్ ఎన్టీఆర్  ,రాంచరణ్ గారి ఫాన్స్ కు ఎంతో ఆనందదాయకం.. RRR  పేరులోనే ముగ్గురు అతిరధ నాయకుల కలయిక తో రూపొందే ఈ చిత్రం పై ఎన్నో భారీ అంచనాలు..అంతేకాక కొమరం భీం రూపం లో జూనియర్ ఎన్టీఆర్ నటన శైలీ,రాజమౌళి గారి దర్శక మలుపులు.రాజమౌళి గారు తన లండన్ ట్రిప్ లో కొంచెం బిజీ వల్ల  పోస్టర్ విడుదల చేయలేకపోతున్నారు..రామచరణ్ గారి నటన వైడుర్యాలకై సినీరంగ ప్రియులు,విశ్లేషకులు కళ్ళల్లో  ఒత్తులు  వేసుకొని  చూస్తున్నారు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Komaram Bheem  RRR  Jr NTR  

Other Articles