తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్ గుర్తుందా. అమె ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అయితే ఈ వ్యాధికి ఇప్పటికే పలుమార్లు చికిత్స చేయించుకున్నా అది తగ్గినట్టే తగ్గి మళ్లీ దాడి చేస్తోందట. దీంతో ప్రస్తుతం అమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పోందుతున్నారు. ఇంతకీ అమెకు వచ్చిన వ్యాధి ఏంటనేగా..?
స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు గతంలోనే గుర్తించారు. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ కోలుకుంటోంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ శరీర వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఫలితం ఉండడంలేదని స్నేహా ఉల్లాల్ వాపోయింది. ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉండాలంటే విసుగొస్తోందని, అయితే, నెట్ ఫ్లిక్స్, కొందరు శ్రేయోభిలాషులు ప్రతిక్షణం వెంట ఉండడంతో నెట్టుకొస్తున్నానని తెలిపింది.
ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఆసుపత్రి బెడ్ పై తాను పడుకున్న ఫొటోలను అమ్మడు పోస్ట్ చేసింది. స్నేహా ఉల్లాల్ తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో సింహా వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. అనంతరం కొన్ని తెలుగు సినిమాల్లో చేసినా అవేవీ విజయవంతం కాలేదు. దాంతో ముంబయి మకాం మార్చింది. ఆమె చివరిగా 2014లో 'అంతా నీ మాయలోనే' చిత్రంలో నటించింది.
(And get your daily news straight to your inbox)
Dec 06 | వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ చిత్రాన్ని జనవరి 24న 2020లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై... Read more
Dec 06 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ టీజర్ ఇటీవల విడుదలైంది. మరో... Read more
Dec 06 | డాక్టర్ దిశ హత్యాచార ఉదంతంపై స్పందించిన తెలుగు సినీ పరిశమ.. అంతకు రెట్టింపు వేగంతో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా..? పోలీసులు సకాలంలో స్పందించి... Read more
Dec 05 | అంజలి అమీర్.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు... Read more
Dec 05 | డాక్టర్ దిశ హత్యాచారం ఉదంతం యావత్ దేశంలో సంచలననాన్ని రేకెత్తించగా, దీనిపై మన తెలుగు సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో... Read more