tamanna to play jaya prada role in NTR biopic ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్లో తమన్నా బిజీ..

Tamanna to play jaya prada role in ntr biopic

actress tamanna, Jaya prada, bala krishna, krish, tamanna bhatia, rakul preet singh, sumanth, ntr biopic, latest movie news, kollywood, movies, entertainment

Actress tamannah bhatia is busy in NTR biopic shooting, she is playing the role of yesteryears leading herione jaya prada in the movie.

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్లో తమన్నా బిజీ..

Posted: 10/20/2018 05:54 PM IST
Tamanna to play jaya prada role in ntr biopic

ఆంధ్రుల అభిమాన నటుడు, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటిభాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈ భాగంలో అక్కినేనిగా సుమంత్.. శ్రీదేవిగా రకుల్ కనిపించనున్నారు. ఇక జయప్రద పాత్రకోసం ఇటీవలే తమన్నాను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఆమె షూటింగులో కూడా పాల్గోంటున్నట్లు వార్తలు అందుతున్నాయి.

'అడవిరాముడు' .. 'సూపర్ మేన్' .. 'యమగోల' తదితర చిత్రాలు ఎన్టీఆర్ - జయప్రద కాంబినేషన్లో ఘన విజయాలను సాధించాయి. ఈ సినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒకటి రెండు సన్నివేశాలకు .. ఒక సూపర్ హిట్ సాంగ్ కు చోటుదక్కినట్టు చెబుతున్నారు. జయప్రద పాత్రలో తమన్నా ఎలా ఒదిగిపోనుందో .. ఏ సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేయనుందో తెలియాలంటూ సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాలి. కాగా, ఈ సినిమాను  సంక్రాంతికి  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రనిర్మాణ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress tamanna  Jaya prada  bala krishna  krish  tamanna bhatia  ntr biopic  tollywood  

Other Articles