రాఘవేంద్రరావు పై నాగ్ కామెంట్.. సినిమా తీయమంటే డాక్యుమెంటరీ తీశాడంట | Nagarjuna on Shirdi Sai Flop.

Nagarjuna om namo venkatesaya interview

Om Namo Venkatesaya, Akkineni Nagarjuna Interview, Nagarjuna About Shirdi Sai Failure, Om Namo Venkatesaya Cansor, Om Namo Venkatesaya Release Date, Om Namo Venkatesaya Promotions, Om Namo Venkatesaya Nagarjuna, Om Namo Venkatesaya Director

Annamayya and Sri Ramadasu were big successes. Their last film Shirdi Sai wasn’t that memorable. In om namo venkatesaya Promotions Nagarjuna Confess that Shirdi Sai was huge mistake in his carrier . Lacking of Huge Assets and Familiar Story that movie was didn't well at box office.

ఆ సినిమా చేసి తప్పు చేశాను: నాగ్

Posted: 02/01/2017 04:29 PM IST
Nagarjuna om namo venkatesaya interview

కమర్షియల్ పంథాలో వెళ్తున్న తెలుగు సినిమాకు అన్నమయ్యతో ఒక్కసారిగా భక్తిరసం రుచి చూపించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నాగార్జున లాంటి రొమాంటిక్ యాంగిల్ ఉన్న హీరోను భక్తి అనే విరహవేదనతో రగిలిపోయే పాత్రలో తెరపై ఆవిష్కరించాడు. ఆ తర్వాత రామదాస్ తో మళ్లీ ఈ పెయిర్ మ్యాజిక్ ను కంటిన్యూ చేసింది. అయితే షిరిడీ సాయి అంటూ వీళ్లు చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు సున్నితంగా తిరస్కరించారు. సక్సెస్ ఫుల్ కాంబోగా హిస్టరీ ఉన్న వీరి ఖాతాలో అది దారుణమైన డిజాస్టర్ గా రికార్డయ్యింది.

ప్రస్తుతం ఓం నమోవేంకటేశాయ నమ: ప్రమోషన్ లో పాల్గొంటున్న నాగ్ ఆ చిత్రం ఫ్లాప్ పై స్పందించాడు. అసలు మనందరికీ తెలిసిన సాయిబాబా కథను ఎంచుకుని మేం తప్పుచేశాం. పైగా సినిమాలో భారీతనం లేదు. చిన్న చిన్న సెట్ లతోనే కానిచ్చేశాం. సినిమాకు ప్లస్ అవుతుందని కామెడీ ట్రాక్స్ జోడిస్తే అదే నెగటివ్ అయ్యింది. వెరసి ఓ చిన్న డాక్యుమెంటరీలాగా తయారయ్యింది. అందుకే ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా ఆదరించలేదు అని చెప్పుకొచ్చాడు.

అయితే ఓం నమో వెంకటేశాయ మాత్రం తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని కథని, 16వ శతాబ్దం నాటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశాకే రాఘవేంద్రరావు కథతో ముందుకు వచ్చాడని తెలిపాడు. చాలా వినోదాత్మకంగా, పైగా ఇప్పుడున్న యూత్ కనెక్ట్ అయ్యే అంశాలతో అద్భుతంగా సినిమా తెరకెక్కిందని నాగ్ వివరించాడు. ఇప్పటికే భారీ ప్రీ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ కాంబో మరోసారి తమ సత్తా చూపిస్తుందా చూడాలి. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి 10న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Namo Venkatesaya  Akkineni Nagarjuna  Interview  

Other Articles

Today on Telugu Wishesh