సామాజిక అంశంపై గళం విప్పిన నిఖిల్ hero nikhil joins list of tollywood heros demanding special status

Tollywood young hero nikhil comments on ap special status protest

nikhil, tollywood hero, andhra pradesh, special status, special status to ap, chandrababu, vishakapatnam, vizag, RK beach, silent protest

Demanding The Central Government to help the State of AP in every way it can. i support #APSpecialStatus” revealed hero Nikhil.

సామాజిక అంశంపై గళం విప్పిన నిఖిల్

Posted: 01/29/2017 11:25 AM IST
Tollywood young hero nikhil comments on ap special status protest

నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా అవసరమని సినీ హీరో నిఖిల్‌ అన్నారు. రిపట్లిక్ డే రోజున విశాఖలోని అర్కే బీచ్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇచ్చిన పిలుపుకు ఆయన కూడా మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమానికి తాను మద్దతునిస్తున్నానని,. ప్రస్తుతం ఒక మెట్రో నగరం కూడా లేని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరమని, అన్ని నిధులు కేవలం ప్రత్యేక హోదాతో మాత్రమే వస్తాయని అయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ వాదులు పోరాటంతో రాష్ట్రాన్ని, తమిళులు ఐక్య ఉద్యమంతో తమ సాంస్కృతిక క్రీడపై నిషేధాన్ని తొలగించుకుని చట్టాన్ని తీసుకురాగలిగినప్పుడు మనం ఐక్యంగా ఉద్యమించి ప్రత్యేక హాదాను తెచ్చుకోలేమా? అని అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగి వుంటే బాగుండేదన్నారు. పవన్ చెప్పినట్లుగా కనీసం గంట సేపు యువతను నిరసన తెలిపేందుకు అనుమతించి వుంటే బాగుండేదని అన్నారు. ప్రస్తుతం కేశవ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నాగార్జున లాంటి పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles