స్టార్ హీరోల వారసులపై హాటీ సంచలన కామెంట్లు | Richa Chadda Comments on Star Kids.

Richa chadda sensational comments on bollywood

Richa Chadda, Richa Chadda Hollywood Movie, Richa Chadda Star Kids, Richa Chadda Bollywood, Richa Chadda Sensational Comments, Richa Chadda Outsider Comments

Richa Chadda Comments on Star Kids. Don't care about the outsider tag anymore.

హీరోయిన్ ను అంతలా అవమానించారా?

Posted: 01/28/2017 04:36 PM IST
Richa chadda sensational comments on bollywood

కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా సినీ ఇండస్ట్రీలో వారసుల పరంపంర దాదాపు అన్ని భాషల్లో చూస్తున్నాం. 70వ దశకంలో మొదలైన ఈ స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ టూమచ్ గా ఉంది. దీని ద్వారా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి అవకాశాలు తగ్గిపోవటమే కాదు, సినిమాలు రిలీజ్ అయిన టైంలో చుక్కలు కూడా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు ట్రీట్ మెంట్లో కొంచెం తేడా ఉంటుంది. ఇలా నటులను వేర్వేరుగా చూడటం తనకు చాలా అసహ్యంగా ఉంటుందని బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా తెలిపింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చిన వాళ్లు అంటే తమ లాంటి వాళ్లేమీ ఇతర గ్రహాల నుంచి రాలేదని చెప్పింది. తనను ఇప్పటికీ బయటి వ్యక్తిగానే చూస్తున్నారని వాపోయింది.

అవకాశాలు ఇవ్వకుండా ఉండటమే కాదు, అల్రెడీ ఓకే అయిన ప్రాజెక్టుల నుంచి తనను తప్పిస్తున్నారని అంటోంది. అందుకే తనకు ఔట్ సైడర్ అనే పదమే సరిపోదని చెప్పింది. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వారిలాగానే బయట నుంచి వచ్చిన వారు కూడా సక్సెస్ అవుతారనే విషయాన్ని ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలని రిచా చెప్పింది. కష్టపడే వారికి విజయం తప్పకుండా దక్కుతుందని, తనకు మళ్లీ అవకాశాలు క్యూ కడతాయంటూ చెబుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Richa Chadda  Bollywood  Star Kids  Outsider  

Other Articles