Pawan kalyan gopala gopala first look update

pawan kalyan first look in gopala gopala, gopala gopala first look, gopala gopala release date, gopala gopala latst updates, venkatesh in gopala gopala movie, gopala gopala cast and crew, tollywood latest updates, sreya latest movie updates, pawan kalyan gabbar singh2 update

pawan kalyan gopala gopala first look : power star pawan kalyan latest movie gopala gopala all set to release for sankranti 2015 movie shooting comes to end and movie trailer will release by lastweek of november more details awaited

హ్యాపి ఎండింగ్ కు సిద్దమైన పవన్

Posted: 11/24/2014 09:42 AM IST
Pawan kalyan gopala gopala first look update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో త్వరలోనే హ్యాపి ఎండింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ నెల 28న‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంటే ఫస్ట్ లుక్ తో నవంబర్ కు హ్యాపి ఎండింగ్ ఇచ్చేందుకు పవన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్ విడుదలకు నాలుగు రోజులు సమయం ఉండటంతో ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందా అని  అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ ఫస్ట్ లుక్ గురించి తాజా అప్ డేట్స్ ఏమంటే.., విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకునేలా పోస్టర్ ఉంటుందని అంటున్నారు. టైటిల్ తో పాటు.., ఇద్దరు హీరోలు కన్పించేలా పోస్టర్ ను రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ ను డిసెంబర్ మొదటి వారంలోపు పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత నెల రోజుల సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మూడవ వారంలో పాటల విడుదల, ప్రమోషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. అలా క్రేజ్ పెంచుకుంటూ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి వేషంలో కన్పించనున్నారు. శ్రియ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ మూవీ ‘ఓ మై గాడ్’ రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతోంది. కిశోర్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా సురేష్, శరత్ మరార్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో పలు పెద్ద సినిమాలతో పాటు ‘గోపాల గోపాల’ కూడా ఉండటంతో థియేటర్ల మద్య పోటితో పాటు సినిమాల మద్య కూడా కలెక్షన్ల పోటి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  pawan kalyan  venkatesh  first look  

Other Articles