Bulls trapped in bear's grip: Nifty below 7750 mark

Sensex falls 227 points nifty below 7750 on weak china data

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

All the sectors dropped in the range of 1-4 per cent in a single day. The Nifty ended lower by 58 points at 7747 and Sensex closed 207 points down at 25229.

విదేశీ వ్యతిరేక పవనాలు.. నష్టాల్లో మార్కెట్లు.. 7750 దిగువన నిఫ్టీ

Posted: 05/03/2016 04:47 PM IST
Sensex falls 227 points nifty below 7750 on weak china data

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ల ఇవాళ త్రీవ ఒడిదోడుకులకు గురయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాల ఫలితంగా అప్పటి వరకు లభించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు లాభాలలో పయనించాయి. ముఖ్యంగా చైనా తిరోగమనాన్ని కూడా అధిగమించి లాభాలను అర్జించిన మార్కెట్లకు ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలు కుదిపేశాయి. దీంతో మార్కెట్లలో పలు క్రీయాశీలక ఇవాళ అన్ని సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్ 25 వేల 230 మార్కుకు దిగువన, నిఫ్టీ 7750 మార్కుకు దిగువన ముగిసాయి. సెన్సెక్ 207 పాయింట్లను నష్టపోయి 25 వేల 229 మార్కు వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 59 పాయింట్లు కోల్పోయి 7 వేల 747 పాయింట్ల వద్ద ముగసింది. మార్కెట్లు ప్రారంభంలో 225 పాయింట్ల లాభాలను అర్జించిన సెన్సెక్ ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన వత్యిరేక ఫవనాలతో లాభాలు హారించుకుపోగా, మరో 207 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

ఇవాళ్లి ట్రేడింగ్ లో అన్ని సూచీలు నష్టాల బాటలో పయనించాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, ఐటి, హెల్త్ కేర్, మెటల్స్, మద్య తరహా పరిశ్రమలు, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకోగా, అటో, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్, మెటల్స్, టెక్నాలజీ, చిన్న తరహా పరిశ్రమల సూచీలు, ఎఫ్ఎంజీసీ సూచీలు స్వల్ప నష్టాలను చవిచేశాయి. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, భారతి ఇఫ్రాటెల్, ఐడియా సెల్యూలార్, గ్రాసిమ్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, కోల్ ఇండియా, లుపిన్, బిహెచ్ఇఎల్, ఐసిఐసీఐ బ్యాంక్, అంబుజా సిమెంట్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles