Yuan devaluation sinks rupee to 24-month low, closes at 65.10 level

Rupee breaches 65 dollar on continued slide in chinas yuan

Indian rupee, currency, dollar, RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Continued devaluation of the Chinese yuan sank the Indian rupee further on Thursday to its lowest level against the US dollar in 24 months at Rs 65.23 to the greenback.

రెండేళ్ల కనిష్టస్థాయికి రూపాయి.. 65.10 పైసల వద్ద ముగింపు

Posted: 08/13/2015 04:40 PM IST
Rupee breaches 65 dollar on continued slide in chinas yuan

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కోనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దిగజారుతున్న రూపాయి మారకం విలువ ఇవాళ్టి ముగింపుతో రెండేళ్ల కనిష్టస్థాయికి చేరింది. తాజాగా  చైనా కరెన్సీ  యువాన్ విలువ తగ్గింపు కారణంగా డాలర్‌తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయిని(ఇంట్రాడేలో) తాకింది. నానాటికి తీసికట్టు అన్నట్టుగా రూపాయి విలువ గురువారం  రూ 65.10 మార్కును  తాకింది. దీంతో మరో రికార్డు స్థాయికి రూపాయి దిగజారేలా కనిపిస్తోందని ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో 2013  ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో 65  రూపాయల స్థాయికి పడిపోయిన   భారత కరెన్సీ విలువ ఇపుడు మళ్లీ అదే స్థాయి కి చేరుకుంది.  దీంతో రిజర్వ్ బ్యాంక్ ఇండియా రూపాయి పతన నిరోధానికి  ఆలోచిస్తోంది.  రూపాయి విలువను మరింత కిందకు దిగజారనీయకుండా రిజర్వు బ్యాంకు తన వద్దనున్న డాలర్ల అమ్మకాలకు చూస్తున్నట్టు సమాచారం.

చైనా కరెన్సీ యువాన్‌ను రెండో రోజూ డీ వాల్యూ చేయడం అంతర్జాతీయంగా రూపాయి విలువను దెబ్బతీసింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ హావా కొనసాగడంతో యూరో, పౌండ్‌ల మారకం విలువ కూడా పతనమైంది.  గ్రీస్‌లో ఏర్పడిన సంక్షోభం, ఫెడరల్ వడ్డీ రేట్లపై స్పెక్యులేషన్ వార్తలతో డాలర్‌కు  బాగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది.. దీంతో రిటైల్ మదుపర్లు డాలర్ కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబర్చారు.  ఫలితంగా  రూపాయి విలువ మరింత దిగజారిందని బ్రోకర్లు అంటున్నారు. దీని ప్రభావం స్టాక్మార్కెట్లపై కూడా పడే ప్రమాదముంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  Indian rupee  currency  dollar  RBI  

Other Articles