భారద్వాజస శతకం నాల్గవ సంపుటి | Bharadwajasa Shatakam 4th Phase

Bharadwajasa shatakam 4th phase

Bharadwajasa Shatakam written by Raghuram Patibanda, Bharadwajasa Shatakam, Raghuram Patibanda Bharadwajasa Shatakam

Bharadwajasa Shatakam written by Writer Raghuram Patibanda.

భారద్వాజస శతకం

Posted: 10/27/2016 03:32 PM IST
Bharadwajasa shatakam 4th phase

1. నిర్జీవులను కాలుస్తుంది చితి

సజీవులను దహిస్తుంది చింత

కరిగి పోయే మంచు లాంటిది జీవితం

ఉన్నంతలో పంచాలి నలుగురికని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

***

2. శాంతిలేని మనసుకు విశ్రాంతిలేదు

అత్యాసలవల్ల గతి తప్పు తుంది మనస్సు

మితి మీరిన కొరికల వల్ల ఆనందం తగ్గు తుంది

వాంఛల త్యాగమే మహోన్నతికి మార్గమని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

***

3. మెలుకువ వచ్చినప్పుడే నిద్రించిన సంగతి తెలుస్తుందని

కనులు మూసి నప్పుడే మానవత్వం ఎంత వుందని పశ్నించుకోవాలి

అణుకువ లేకుంటే అందంకూడా వికారమేనని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

***

4. సంసార మనే నౌకను, నడిపించేవాడు భర్త

బాధ్యద్యతలనుండి తప్పించుకోరాదు ఏనాడు

భార్య భర్తల అనుబంధం విడరాదు ఏనాడు

జీవితాన్ని సహనంతొ ఎదుర్కొవాలని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

***

5. వాస్తవికతను తెలుసుకోలేనివాడు వాస్తవానికి దూరంగాఉంటాడు

మనిషి లోనిమర్మాన్ని తెలుసుకోలేనివాడు మానవత్వానికి దూరంగాఉంటాడు

సాధనమున సాధించలేని వాడు, ఎందులోనూ సమకూర లేడనే సత్యాన్ని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

                                                                                                      -రఘురాం పాటిబండ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharadwajasa Shatakam  Raghuram Patibanda  

Other Articles

 • Bharadwaja satakam poems

  భారద్వాజస శతకం

  Nov 02 | 1. భార్యా భర్తల బందం విడరాని రాని అనుబంధంమనసులు కలవాలి పాలు నీళ్ళులాసుఖ దుఃఖా లను పంచుకొవాలి ఆప్యాయంగాననిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. కాయశరీరం కాంతి శరీరంకొరివి శరీరం కరకు శరీరంకీర్తి శరీరం ఉత్తమ... Read more

 • Kadupu nindina vaadu aakali erugadu

  కడుపు నిండినవాడు ఆకలి యెరుగడని

  Oct 13 | 1.కడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదనిదు:ఖం ఒక రోగం,... Read more

 • Bharadawajasa satakam poems written by raghu ram patibanda

  భారద్వాజస

  Sep 20 | 1. సత్యము పలుకువాడు అసత్యమెరుగడనికడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే... Read more

 • Bharadwaja satakam poems

  భారద్వాజస శతకము

  Sep 12 | వెన్నెలవంటిచూపులు,వెన్నవంటిమనస్సువెలుగు లాంటి జీవితం,వేదన లేని ప్రవర్తనకోరుకుంటాడు ప్రతి జీవి , అదే పరమార్ధమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//  మనసులోని వేదన మమతకే తెలుసుననిప్రేమలోని అనురాగం ప్రేమించే వారికే తెలుసుననికడలిలోనిలోతు ఒక్కనీటికే తెలుసుననితల్లిప్రేమ మాతృమూర్తికే తెలుసుననే... Read more