Woman gives birth on plane bound for phoenix

Woman gives birth on plane, Woman gives birth on Southwest Airlines, baby born in air, baby born in plane, baby born in Southwest Airlines,

Southwest Airlines passenger goes into labor just minutes after taking off from San Francisco. The flight is diverted to LAX, and the baby is born in the air.

ఆకాశంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..

Posted: 12/10/2014 05:04 PM IST
Woman gives birth on plane bound for phoenix

సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్లో అరుదైన ఘటన చోటుచేసకుంది. ఒక్కసారిగా విమానం మెటర్నిటీ వార్డుగా మారిపోయింది. ఓ ప్రయాణికురాలు ఆకాశంలో తన బిడ్డకు జన్మనిచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి ఫీనిక్స్ వెళ్లాల్సిన ఆ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే, విమానంలోని ఓ ప్రయాణికురాలికి ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, విమానాన్ని లాస్ ఏంజెల్స్ కు మళ్లించారు. విమానం లాస్ ఎంజెల్స్ చేరుకునే లోపు ప్రయాణికులలో వున్న ఓ డాక్టర్, నర్సు ఇద్దరూ ఆ తల్లికి పురుడు పోసేందుకే వచ్చినట్లు వుండడం గమనార్హం.

డాక్టర్, నర్సు ఆ ప్రయాణికురాలు కాన్పు విషయంలో సాయపడ్డారు. ఎలాంటి సమస్య లేకుండా ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ ఏడుపు వినిపించగానే ఫ్లైట్ కెప్టెన్ మైక్ లో స్వాగతం పలకగా, ప్రయాణికుంలందరూ తమ హర్షద్వానాలతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాస్ ఏంజెలిస్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండయ్యాక తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక విభాగం ప్రతినిధి ఎరిక్ స్కాట్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Southwest Airlines  pregnant woman  San Francisco  Phoenix  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh