Isro to launch communication satellite gsat 16 on december 5 from french guiana

GSAT-16, GSAT, Satellite, communication satellite, Indian Space Research Organisation, ISRO, GSLV Mark III, French Guiana, Ariane 5

India is set to launch its latest communication satellite GSAT-16 onboard Ariane 5 rocket from French Guiana

గుయానా నుంచి జీశాట్-16 ప్రయోగానికి సన్నాహాలు

Posted: 12/03/2014 05:09 PM IST
Isro to launch communication satellite gsat 16 on december 5 from french guiana

దేశంలో ట్రాన్స్‌పాండర్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇస్రో.. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహాన్ని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2.08 గంటలకు ప్రయోగించనుంది. ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఏరియన్-5 ఈసీఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నారు. బెంగళూరులో తయారుచేసిన జీశాట్-16 ఉపగ్రహాన్ని ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు చేర్చారు. ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12 కేయూ బాండ్స్ ట్రాన్స్‌పాండర్స్, 24 సీబాండ్, 12 ఎక్సెటెండెడ్ సీబాండ్ ట్రాన్స్‌పాండర్లును అమర్చి పంపుతున్నారు.

48 ట్రాన్స్‌పాండర్లను ఒకేసారి పంపడం ఇదే తొలిసారి. మూడు టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానం మనవద్ద లేకపోవడంతో ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని అక్కడి నుంచి చేపడుతున్నారు. మనం అత్యంత బరువైన ఉపగ్రహాలను ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి, వాళ్లు అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను మనదేశంలోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నారు. స్పాట్-6, స్పాట్-7 వంటి ఫ్రాన్స్ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తెలిసిందే. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం విజయం సాధిస్తే ఇంతటి బరువైన ఉపగ్రహాలను మనమే అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంటుంది.చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more