బొమ్మ తుపాకీతో స్థానికులను భయపెట్టిన నల్లజాతి బాలుడిని కాల్చి చంపిన శ్వేత పోలీసుపై అభియోగాలు నమోదు చేయాల్సిన అవసరం లేదంటూ కోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయంపై రెండు రోజులుగా నిరసనలతో అట్టుడికిన అమెరికాలోని ఫెర్గూసన్‌లో చాలావరకు ప్రశాంత పరిస్థితి నెలకొంది. థ్యాంక్స్‌గివింగ్ సెలవుకు ముందు రోజు క్యాలిఫోర్నియా పట్టణాలైన ఓక్‌ల్యాండ్, లాస్ ఏంజిలెస్, సాన్ డీగోలో వందలాది మంది ప్రదర్శనలను నిర్వహించారు. లండన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం వెలుపలా నిరసనలు జరిగాయి. ఆందోళన కారులు ఫెర్గూసన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నామంటూ ప్రదర్శనకు దిగారు.
లండన్ ఉత్తర ప్రాంతంలో 2011లో పోలీసులు కాల్చి చంపిన మార్క్ డగన్ కుటుంబం ఇందులో పాల్గొంది. ఆగస్టు 9న డారెన్ విల్సన్ అనే పోలీసు అధికారి 18 ఏళ్ల మైఖేల్ బ్రౌన్‌ను కాల్చి చంపటంతో ఫెర్గూసన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కోర్టు ధర్మాసనం నిర్ణయంతో ఇవి ఈ వారంలో మరోసారి చెలరేగాయి. అయితే అమెరికాలో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు, కురుస్తున్న హిమాపాతం కూడా ఒకింత నిరసనకారులను భయటకు రావడంలో అడ్డుకున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more