Giving ntr name to domestic terminal is insult to him says raghuveera reddy

shamshabad airport, domestic terminal, ntr name, raghuveera reddy, insult, backstab, BJP, Sc, st atrocities act

giving ntr name to domestic terminal is insult to him says raghuveera reddy

ఎన్టీయార్ అంటే మీకున్న గౌరవం అంతేనా..?

Posted: 11/22/2014 04:29 PM IST
Giving ntr name to domestic terminal is insult to him says raghuveera reddy

శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన స్థాయిని తగ్గించడమేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కేవలం డొమెస్టిక్ టెర్మినల్కు మాత్రమే ఆయన పేరు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్టీయార్ పై మీకున్న గౌరవం అంతేనా అంటూ నిలదీశారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డును ఇప్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై మీకు నిజమైన ప్రేమ, గౌరవం, అప్యాయతలు వుంటే.. ఆయన స్థాయికి తగ్గట్టుగా భారత రత్న అవార్డును ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, వైశ్రాయ్ హోటల్లో ఆయనపై చెప్పులు వేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బతికివున్నప్పడు అతని బాగోగులు పట్టించుకోని నాయకులు, అతని మరణానంతరం ఓట్ల కోసం, ఎన్టీయార్ పేరును వాడుకుని అపకీర్తి పాటు చేస్తున్నారని ధ్వమెత్తారు. టీడీపీ నేతల వ్యవహరాలు చూస్తూంటే.. ఎన్టీఆర్ ఆత్మ కూడ క్షోభిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని కూడా రఘువీరారెడ్డి ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shamshabad airport  domestic terminal  ntr name  raghuveera reddy  insult  backstab  BJP  Sc  st atrocities act  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more